- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan Kalyan Movie OG Movie Update at Political time in Film Industry Telugu Heroes Photos
Pawan Kalyan – OG: OG సినిమాపై చాలా రోజుల తర్వాత కదలిక.! పొలిటికల్ హీట్ లో అప్డేట్.
ETలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకోక చాలా రోజులైపోయింది కదా.. అయినా ఆయన ఉన్న పొలిటికల్ బిజీకి సినిమా అప్‌డేట్స్ ఆశించడం కూడా తప్పే అవుతుందేమో..? ఇలాంటి సమయంలోనూ OG నుంచి అనుకోకుండా ఓ అప్‌డేట్ వచ్చింది. అది చూసాక ఫ్యాన్స్ పండగ మామూలుగా ఉంటుందా..? ఇంతకీ ఏంటా అప్‌డేట్.. దాని సారాశమేంటి.? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. ఆయన నుంచి సినిమా అప్‌డేట్స్ ఊహించడం కూడా అత్యాశే.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Jan 30, 2024 | 5:52 PM

ETలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకోక చాలా రోజులైపోయింది కదా.. అయినా ఆయన ఉన్న పొలిటికల్ బిజీకి సినిమా అప్‌డేట్స్ ఆశించడం కూడా తప్పే అవుతుందేమో..? ఇలాంటి సమయంలోనూ OG నుంచి అనుకోకుండా ఓ అప్‌డేట్ వచ్చింది.

అది చూసాక ఫ్యాన్స్ పండగ మామూలుగా ఉంటుందా..? ఇంతకీ ఏంటా అప్‌డేట్.. దాని సారాశమేంటి.? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. ఆయన నుంచి సినిమా అప్‌డేట్స్ ఊహించడం కూడా అత్యాశే.

అందుకే హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. కానీ సుజీత్ ఒక్కడే ఓజిని అంటి పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారీయన.

పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజి షూటింగ్ ప్రస్తుతానికి ఆపేసారు కానీ అప్‌డేట్స్ మాత్రం ఆపట్లేదు దర్శక నిర్మాతలు. ఓజి చేతులు మారిందంటూ ఆ మధ్య ఏదో రూమర్ వస్తే.. ఓజి మాదే.. ఎప్పటికీ మాదే అంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.

ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్‌గా పోస్ట్ చేసారు. హరిహర వీరమల్లు లేట్ అవ్వడంతో బజ్ ముందులా లేదు.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్.. దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటైన సినిమాల్లో ఓజిపైనే అంచనాలు భారీగా ఉన్నాయి.

పైగా ఇది పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే సుజీత్ కూడా ప్రస్టేజియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తైంది. ఏపీ ఎన్నికల తర్వాత ఓజి సెట్‌లో పవన్ అడుగు పెట్టనున్నారు.

ఓజిలో గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నారు పవన్. మరో 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ చిత్రం పూర్తైపోతుంది. జూన్ ఫస్ట్ వీక్‌లో ఓజి కోసం డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఇదే జరిగితే ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ ఫోకస్ చేసే ఫస్ట్ సినిమా ఓజినే.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కానుకగా OGని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఏదేమైనా ఓజి తర్వాతే.. ఉస్తాద్, హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు పవన్.





























