- Telugu News Photo Gallery Cinema photos Director S.S Rajamouli Help For Akkineni Akhil Next Movie Telugu Heroes Photos
Rajamouli – Akkineni Akhil: అఖిల్ కోసం రంగంలోకి రాజమౌళి.! ఈసారి అయిన హిట్స్ వస్తుందా?
ఏజెంట్ తర్వాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏం చేసినా సైలెంట్‌గా చేయాలని ఫిక్సైపోయారు అక్కినేని వారసుడు. అందుకే కొత్త సినిమా కోసం ఏకంగా ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడి సాయం తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరబ్బా ఆ దర్శకుడు అనుకుంటున్నారా..? ఇంకెవరు రాజమౌళే.. మరి అఖిల్ కొత్త సినిమాకు రాజమౌళికి ఉన్న సంబంధమేంటి..? ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా.. గజినిలా దండయాత్ర చేస్తున్నా.. బ్లాక్‌బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు.
Updated on: Jan 30, 2024 | 5:31 PM

ఏజెంట్ తర్వాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏం చేసినా సైలెంట్‌గా చేయాలని ఫిక్సైపోయారు అక్కినేని వారసుడు. అందుకే కొత్త సినిమా కోసం ఏకంగా ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడి సాయం తీసుకుంటున్నారు.

ఇంతకీ ఎవరబ్బా ఆ దర్శకుడు అనుకుంటున్నారా..? ఇంకెవరు రాజమౌళే.. మరి అఖిల్ కొత్త సినిమాకు రాజమౌళికి ఉన్న సంబంధమేంటి..? ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా.. గజినిలా దండయాత్ర చేస్తున్నా.. బ్లాక్‌బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు.

క్లాస్ మాస్ రొమాన్స్ అన్నీ ట్రై చేస్తున్నా ఏదీ వర్కవుట్ అవ్వట్లేదు. ఏజెంట్‌తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది. దాంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి.

ప్రస్తుతం అనిల్ అనే కొత్త దర్శకుడితో యువీ క్రియేషన్స్‌లో సినిమా చేయబోతున్నారు అఖిల్. సుజీత్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన అనిల్.. యువీ క్రియేషన్స్‌లో చాలా సినిమాల స్క్రిప్ట్‌కు సాయం చేసారు.

ఈయన అఖిల్ కోసం పీరియాడిక్ ఫాంటసీ కథను సిద్ధం చేసారు. దీనికి ధీర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథా చర్చలు రాజమౌళి సమక్షంలో జరుగుతున్నాయని.. సలహాలు సూచనల మేరకు కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది.

అఖిల్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారని తెలిసాక అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏజెంట్ ఫ్లాపైనా.. అఖిల్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్లు భారీగానే ఖర్చు చేయాలని ఫిక్స్ అయిపోయారు యువీ క్రియేషన్స్.

త్వరలోనే సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికోసమే ప్రస్తుతం సిద్ధమవుతున్నారు అక్కినేని వారసుడు.




