Viral Video: పాపం.. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసిన కోడి, కుక్క రియాక్షన్‌ చూడాలి.. పొట్ట చెక్కలే..!

నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 46.1 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. ఓ మై గాడ్ ఈ సీన్ చాలా ఫన్నీగా ఉందంటున్నారు నెటిజన్లు. పాపం కుక్క మొదటిసారిగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఉంటుందని ఫన్నీ రియాక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ సీన్ చూసి చాలా మంది నవ్వుకుని మురిసిపోయామంటున్నారు.

Viral Video: పాపం.. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసిన కోడి, కుక్క రియాక్షన్‌ చూడాలి.. పొట్ట చెక్కలే..!
Chicken And Dog
Follow us

|

Updated on: Jan 30, 2024 | 8:27 PM

మనందరికీ ప్రతిరోజూ మన ముఖాన్ని అద్దంలో చూడటం చాలా ఇష్టం. అయితే జంతువులు తమ ముఖాలను అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. మనుషులకు ఉన్నన్ని తెలివి తేటలు లేని మూగజీవాలు..ఎదురుగా ఉన్నది మరో జంతువు అనుకుంటాయి..దాంతో తన మీదకు దూసుకొస్తుందని భావించి దాడికి దిగుతుంటాయి..ఇలా జంతువులు తమ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటే ఎలా స్పందిస్తాయో అనే ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక కుక్క, కోడి మొదటిసారి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసి షాక్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియో వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో అమాయక కుక్క, కోడి మొదటిసారిగా అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకోవడం, ఇది వేరే జంతువు కావచ్చు అని కోపంతో అద్దం వైపు అరుస్తూ కోపం ప్రదర్శిస్తున్న హాస్య సన్నివేశం చూడవచ్చు. ఈ ఫన్నీ వీడియో @stickerlinemakham అనే Instagram పేజీలో షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో, కోడి, కుక్క ఎలా స్పందిస్తాయో చూడటానికి ఎవరో తమ ఇంటి పెరట్లో ఒక పెద్ద అద్దాన్ని ఉంచారు. అద్దం ముందు కొంచెం ఆహారాన్ని వేశారు. ఈ తిండి తినడానికి వచ్చిన కోడి అద్దంలో తన ప్రతిబింబం చూసి, అది వేరే కోడి అనుకుంటుంది. తనకు పెట్టిన తిండి అంతా తినేస్తుందని కోపంగా తన ముక్కుతో అద్దం మీద కొడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ కుక్క అదే అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఎదురుగా మరో కుక్క వచ్చిందని భావించి.. బో..బో..బో.. అంటూ కోపంగా మొరిగే హాస్య దృశ్యం కనిపిస్తుంది.

నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 46.1 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. ఓ మై గాడ్ ఈ సీన్ చాలా ఫన్నీగా ఉందంటున్నారు నెటిజన్లు. పాపం కుక్క మొదటిసారిగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఉంటుందని ఫన్నీ రియాక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ సీన్ చూసి చాలా మంది నవ్వుకుని మురిసిపోయామంటున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..