AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైతులకు సాయం చేస్తానంటూ రంగంలోకి జాతీయ పక్షి..! వరి పొలంలోకి వచ్చిన మయూరం ఏం చేసిందంటే..

నెమళ్లు సాధారణంగా మనుషుల దగ్గరికి రావు, మనుషులను చూస్తే పారిపోతుంటాయి. అయితే ఈ నెమలి మాత్రం వరి కోత సమయంలో నేను మీకు సహాయం చేస్తాను అన్నట్టుగా రైతుల పక్కనే తిరిగింది. ఈ క్యూట్ సీన్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో, రైతులు పొలంలో వరి కోస్తుండగా వారి పక్కనే ఆడ నెమలి వెళుతున్న అందమైన దృశ్యాన్ని చూడవచ్చు.

Watch Video: రైతులకు సాయం చేస్తానంటూ రంగంలోకి జాతీయ పక్షి..! వరి పొలంలోకి వచ్చిన మయూరం ఏం చేసిందంటే..
A Peacock Came To The Field
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2024 | 5:51 PM

Share

ఈ ప్రకృతిలో ప్రతిరోజూ ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. విచిత్రమైన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇక్కడ పంట కోసే సమయంలో వరి పొలానికి వచ్చిన నెమలి వరి పొలాల్లోని పురుగులను తింటూ రైతులతో గడిపింది. నెమళ్లు సాధారణంగా మనుషుల దగ్గరికి రావు, మనుషులను చూస్తే పారిపోతుంటాయి. అయితే ఈ నెమలి మాత్రం వరి కోత సమయంలో నేను మీకు సహాయం చేస్తాను అన్నట్టుగా రైతుల పక్కనే తిరిగింది. ఈ క్యూట్ సీన్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో, రైతులు పొలంలో వరి కోస్తుండగా వారి పక్కనే ఆడ నెమలి వెళుతున్న అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ వీడియో క్లిప్ @tarapkari1 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 13.9 మిలియన్ వ్యూస్, ఐదు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్ల నుంచి అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు వ్యాఖ్యనిస్తూ..మీరు చాలా అదృష్టవంతులు అన్నారు.

ఇవి కూడా చదవండి

వరిలో చీడపీడలను తగ్గించడానికి రైతులకు సహాయం చేయడానికి ఏకంగా జాతీయ పక్షి రంగంలోకి దిగిందంటూ తమాషాగా వ్యాఖ్యానించారు. మరో వినియోగదారు..ఇది నిస్వార్థ ప్రేమ అన్నారు. నెమళ్లు మనుషులతో కలిసిన ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవని మరికొందరు అన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి