ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌…నక్సల్స్ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, మరో14 మంది..

ఎదురు కాల్పులు జరిగిన సమయంలో 201వ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ఆ ప్రాంతంలో ఉందని సమాచారం. 2021లో మావోయిస్టుల ఆకస్మిక దాడిలో 23 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 33 మంది గాయడ్డారు. టేకుల్‌గూడంలో మరణించిన జవాన్లందరి మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం భయంకరమైన మావోయిస్టు కమాండర్ హిడ్మా స్థావరంగా పిలుస్తారు.

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌...నక్సల్స్ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, మరో14 మంది..
Naxal Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2024 | 8:47 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు నక్సలైట్స్‌ తమ ఉనికిని చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన టేకల్‌గూడెం గ్రామంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దుర్మరణం చెందినట్టుగా తెలిసింది. మరో 14 మంది సైనికులు గాయపడినట్టుగా తెలిసింది. మరోవైపు, దాడి గురించి సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడి చేసిన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. గాయపడిన జవాన్లను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు విమానంలో తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్తర్ డివిజన్‌లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లోని జాగర్‌గుండ కొండల సమీపంలోని తీవ్ర తిరుగుబాటు ప్రభావిత ప్రాంతంలోని టేకుల్‌గూడెం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా శిబిరంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

CRPF కోబ్రా-ఎలైట్ యూనిట్ భద్రతా సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్స్ క్యాంపు సమీపంలో, జోనగూడ-అలిగూడ ప్రాంతం చుట్టూ నక్సల్స్ కాల్పులు జరపడంతో.. జవాన్లు ప్రతీకారం తీర్చుకోవడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారని, భద్రతా శిబిరంపై బీజీఎల్‌ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో 2021లో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన టేకల్‌గూడెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోబ్రా కమాండోలు మావోయిస్టు ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ఘర్షణ జరిగినట్టుగా సమాచారం.. ఎదురు కాల్పులు జరిగిన సమయంలో 201వ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ఆ ప్రాంతంలో ఉందని సమాచారం. 2021లో మావోయిస్టుల ఆకస్మిక దాడిలో 23 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 33 మంది గాయడ్డారు. టేకుల్‌గూడంలో మరణించిన జవాన్లందరి మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం భయంకరమైన మావోయిస్టు కమాండర్ హిడ్మా స్థావరంగా పిలుస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి