అజ్ఙాతం వీడిన ముఖ్యమంత్రి.. ఉన్నపళంగా ఎమ్మెల్యేలతో భేటి.. అసలు విషయం ఇదేనా..?
బీహార్ రాజకీయాలు సంచలనంగా మారిన వేళ.. తాజాగా జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని.. తన సతీమణికి అప్పగించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ కుంభకోణ మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బీహార్ రాజకీయాలు సంచలనంగా మారిన వేళ.. తాజాగా జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని.. తన సతీమణికి అప్పగించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ కుంభకోణ మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే.. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడంతో ఒక్కసారిగా ఏదో జరగబోతోందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే జార్ఖండ్ సీఎం మార్పు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే.. ఆయన సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా నిన్నటి వరకూ ఢిల్లీలో ఉన్న హేమంత్ సొరేన్ ఒక్కసారిగా కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తాను జనవరి 30న ఈడీ విచారణకు హాజరవుతానని అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే జార్ఖాండ్ లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఆయనను ఏక్షణమైనా ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా నోటిసులు పంపించినప్పటికీ విచారణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈడీ చర్యలపై సొరైన్ సోదరి కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని గతంలో నిరసనలు కూడా చేపట్టారు. లోక్ సభ ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈడీ సోదాలు నేతల గుండెల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోఅన్న ఉత్కంఠ రాజకీయ పరిశీలకుల్లో నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








