Rajya Sabha Elections 2024: రాజ్యసభకు సోనియా గాంధీ లేదా ప్రియాంక వాద్రా..! ఎక్కడి నుంచో తెలుసా..?
దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు ఎన్నిక జరుగుతోంది. కానీ అందరి చూపు ఇక్కడే పడింది.

దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు ఎన్నిక జరుగుతోంది. కానీ అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానం నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలను రాజ్యసభకు పంపడంపై చర్చ జరుగుతోంది.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో చర్చిస్తామని హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ సిమ్లాలో చెప్పారు. కావాలంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తామన్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సంగతి తెలిందే.. ప్రియాంక గాంధీ ఇంకా పార్లమెంటు సభ్యురాలు కాలేదు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యసభకు నామినేట్ కాలేదు. ఈ నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సిమ్లా పర్యటనను కూడా ఫిబ్రవరి నెలలో ఉండటం వెనుక దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున ముందుండి ప్రచారం చేశారు. ప్రియాంక గాంధీకి సిమ్లాలోని ఛరాబ్రాలో సొంత ఇల్లు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెన రాజ్యసభకు వెళ్లడంపై చర్చ జోరుగా సాగుతోంది. దీంతో పాటు రాజ్యసభ ఎంపీలుగా కాంగ్రెస్ నుంచి బిప్లవ్ ఠాకూర్, ఆనంద్ శర్మ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇద్దరు నేతలు ఇంతకు ముందు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుతో చాలా సన్నిహితంగా ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో పాటు ఇందు గోస్వామి, ప్రొ. సికందర్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 2018లో జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ 40 సీట్లతో మెజారిటీ సాధించింది. దీంతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్‌కే ఉంది. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 25 సీట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 27న 56 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వస్తాయి. ఫిబ్రవరి 8న ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 15. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ ఫిబ్రవరి 16. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టలు. ఈ 56 స్థానాలకు ఎన్నికలు ముగిశాక పార్లమెంట్ ఎగువ సభ రాజకీయ ముఖచిత్రం మారనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




