AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హీరోలు మన కమాండోలు..! ఆలిండియా కాంపిటిషన్లో ఏపీకి ఓవరాల్..

రన్నరప్‌గా మహా­రాష్ట్ర నిలిచి రజతాన్ని సాధించగా.., సెకండ్‌ రన్నరప్‌గా రాజస్థాన్‌ బ్రాంజ్ సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్‌ కోర్స్‌ బెస్ట్‌ టీం గా ఏపీ జట్టు నిలిచింది. కమాండో విజేతలకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో అదనపు డైరెక్టర్‌ మహేష్‌దీక్షిత్‌ బహుమతులను అందజేశారు. విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌అయ్యనార్‌, ఆపరేషన్స్ అడిషనల్ డిజి ఆర్కే మీనా పాల్గొన్నారు. ఏపీ జట్టు­లోని 13 మంది కమాండో జట్టు సభ్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని సర్వీస్ బోర్డు ప్రకటించింది.

Andhra Pradesh: హీరోలు మన కమాండోలు..! ఆలిండియా కాంపిటిషన్లో ఏపీకి ఓవరాల్..
Ap Greyhounds Team
Maqdood Husain Khaja
| Edited By: Jyothi Gadda|

Updated on: Jan 31, 2024 | 4:53 PM

Share

విశాఖపట్నం, జనవరి 31;  ఆల్ ఇండియా కమాండో కాంపిటీషన్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ పోలీస్ కమాండోలు.. ఈ కాంపిటీషన్లో సత్తా చాటారు. పది వేరువేరు విభాగాల్లో.. అయిదు ట్రోఫీలను గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్స్ గా అవతరించారు. ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా.. దీటుగా ఎదుర్కొనేలా సత్తాను చాటి.. ఆల్ ఇండియా లెవెల్ లో మాకు తిరుగులేదు అన్నట్టు నిరూపించి ఔరా అనిపించారు.

– 14వ ఆలిండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్స్‌ లో ఏపీ జట్టు ఓవరాల్‌ చాంప్ గా నిలిచింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్‌ కమాండో టీం ది బెస్ట్ అనిపించుకుంది. విశాఖలోని గ్రేహౌండ్స్‌ క్యాంపస్ లో 9 రోజుల పాటు కమాండో కాంపిటిషన్ జరిగింది. పది ట్రోఫిల కోసం.. 16 రాష్ట్రలకు చెందిన పోలీస్, మరో ఏడు పారా మిలిటరీ బలగాల నుంచి ఎంపికైన కమాండోలు పోటీ పడ్డాయి . నైపుణ్యతలో ఒకరుకొకరు నిరూపించుకునేందుకు పోటీ పడి సత్తా చాటాయి.

మనమే ఫస్ట్..!

ఇవి కూడా చదవండి

– ఆలిండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు పర్యవేక్షణలో జరిగిన పోటిల్లో.. ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ( ఏఓబీ), ఛత్తీస్‌ఘడ్‌ నక్సల్స్‌ ప్రభావిత అడవుల్లో గెరిల్లా యుద్ధవ్యూహాలు, నైపుణ్యంలో ఏపీ గ్రేహౌండ్స్‌ కమాండోల జట్టు సత్తా చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. దీంతోపాటు బెస్ట్‌ స్టేట్‌ పోలీస్‌ కమాండో టీమ్‌, చక్రవ్యూహం-1 రూల్‌, బెస్ట్‌ బ్లాక్‌హాక్‌ఫైరింగ్‌, టీమ్‌ ఇన్‌ కాన్ఫిడెన్స్‌ విభాగాల్లో తనదైన ప్రత్యేకత శైలిలో పోటీపడి విజేతగా నిలిచిన ఏపీ కమాండో టీం.. ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుంది.

– రన్నరప్‌గా మహా­రాష్ట్ర నిలిచి రజతాన్ని సాధించగా.., సెకండ్‌ రన్నరప్‌గా రాజస్థాన్‌ బ్రాంజ్ సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్‌ కోర్స్‌ బెస్ట్‌ టీం గా ఏపీ జట్టు నిలిచింది. కమాండో విజేతలకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో అదనపు డైరెక్టర్‌ మహేష్‌దీక్షిత్‌ బహుమతులను అందజేశారు. విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌అయ్యనార్‌, ఆపరేషన్స్ అడిషనల్ డిజి ఆర్కే మీనా పాల్గొన్నారు. ఏపీ జట్టు­లోని 13 మంది కమాండో జట్టు సభ్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని సర్వీస్ బోర్డు ప్రకటించింది.

– అఖిల భారత పోలీసు కమాండో పోటీలు ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో 11జరిగాయి. 12, 13 కోవిడ్ కారణంగా నిర్వహించలేదు. 14వ కాంపిటిషన్ రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఏపీ లోని విశాఖ గ్రేహౌండ్స్ క్యాంపస్ లో జరిగాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..