Variety Road Cleaner: మహబూబాబాద్‌లో నయా రోడ్ క్లీనర్.. చూస్తే పారిశుద్ధ్య కార్మికుడికి సలామ్ కొట్టాల్సిందే..
Variety Road Cleaner: ట్యాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆలోచన ఉండాలే గానీ.. ఎన్ని అద్భుతాలనైనా సృష్టించొచ్చు. ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ అదే పని చేశాడు.
Variety Road Cleaner: ట్యాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆలోచన ఉండాలే గానీ.. ఎన్ని అద్భుతాలనైనా సృష్టించొచ్చు. ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ అదే పని చేశాడు. తన బుర్రకు పని చెప్పి వినూత్న ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు మీరు ఇల్లు శుభ్రం చెసే వ్యాక్యుమ్ క్లీనర్స్‌ని చూసారు కదా.. అయితే రోడ్లను సాఫ్ చేసే వ్యాక్యుమ్ క్లీనర్‌ను కూడ మహబూబబాద్ జిల్లాలో పారిశుద్ద్య సిబ్బంది కనుగొన్నారు. అవునండీ బాబూ.. అది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే.. మహబూబబాద్ జిల్లా గూడూరు మేజర్ గ్రామ పంచాయతి. ఇక్కడి పారిశుద్ధ్య కార్మికుడు రోడ్లపైన దుమ్ము, తేలికపాటి చెత్తను తొలగించడానికీ వెరైటీగా ఆలోచించాడు.
బుర్రు పంపు (పురుగు మందు కొట్టే యంత్రం) సాయంతో రోడ్ల ను సాఫ్ చేయడం మొదలు పెట్టాడు. సాధారణంగా ఈ పంపు ను పంట చేళల్లో క్రిమి సంహారక మందును పిచికారీ చేయడానికీ వినియోగిస్తాం. కానీ ఈ పారిశుద్ధ్య కార్మికుడి అవసరం.. దీనిని మరోలా వినియోగించేలా చేసింది. సదరు వ్యక్తి ఈ బుర్రు పంపుతో రోడ్లను క్లీన్ చేస్తుండగా.. పలువురు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. పారిశుద్ధ్య కార్మికుడి వినూత్న ప్రయత్నానికి స్థానికంగా, సోషల్ మీడియాలోనై ప్రశంసలు వస్తున్నాయి. ‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. ధిమాక్ ఉన్నాడో దునియా మొత్తం చూస్తాడు అన్నట్లుగా ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా అసలైన ధిమాక్ ఉన్నవాడే’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also read:
Pulagam: నేడు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు.. దేవి నైవేద్యం పులగం ఎలా రెడీ చేయాలంటే..
Ratan TATA-Air India: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న రతన్ టాటా..! నష్టాలని లాభాల్లోకి ఇలా..!(వీడియో)
మీకు ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ అంటే ఇష్టమా.. కేవలం రూ.86 వేలు మాత్రమే..12 నెలల వారంటీ కూడా..