Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan TATA-Air India: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న రతన్‌ టాటా..! నష్టాలని లాభాల్లోకి ఇలా..!(వీడియో)

Ratan TATA-Air India: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న రతన్‌ టాటా..! నష్టాలని లాభాల్లోకి ఇలా..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 13, 2021 | 9:30 AM

Ratan TATA: 68 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఎయిరిండియా తిరిగి టాటా గూప్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఎయిరిండియాను టాటా సన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Ratan TATA: 68 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఎయిరిండియా తిరిగి టాటా గూప్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఎయిరిండియాను టాటా సన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఓపెన్‌ బిడ్‌లో భాగంగా రూ. 18వేల కోట్ల బిడ్‌తో టాటా ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ఈ సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ దాఖలు చేసిన బిడ్‌ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు.

ఇదిలా ఉంటే ఎయిరిండియా తిరిగి టాటా సన్స్‌ చేతుల్లోకి వెళ్లడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ డీల్‌ పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ఇక ఈ విషయమై తాజాగా టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా జేఆర్డీ టాటాను ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా రతన్‌ టాటా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియాకు ఆయన స్వాగతం తెలిపారు. టాటా గ్రూప్స్‌ ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకోవడం గొప్ప విషయమని అభివర్ణించిన రతన్‌ టాటా.. ఎయిర్ ఇండియాను పున‌ర్ నిర్మిస్తామ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.విమానయాన రంగంలో టాటా గ్రూపు త‌న మార్కెట్ స‌త్తాను మ‌రోసారి చాటుతుంద‌ని ఆయన తెలిపారు. జేఆర్డీ టాటా నాయ‌క‌త్వంలో ఒక‌ప్పుడు ప్రపంచంలో ఎయిర్ ఇండియాకు మంచి గుర్తింపు ఉండేద‌ని తెలిపిన రతన్‌ టాటా, ఆనాటి వైభవాన్ని తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. జేఆర్డీ టాటా ఇప్పుడు ఉండి ఉంటే, ఆయన ఎంతో సంతోషించేవారని తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Good news for SBI customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. అక్టోబరు 31 వరకు ఆఫర్.. త్వరపడండి..(వీడియో)

 Danger Missed Video: వేగంగా దూసుకొచ్చిన కారు.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో..

 Kodiramakrishna Daughter: కోడి రామకృష్ణ కూతురు ఫస్ట్‌ సినిమా స్టార్ట్‌..! ఆశీస్సులు అందించిన సినీ పెద్దలు..(వీడియో)

 Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే ‘నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)