Good news for SBI customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. అక్టోబరు 31 వరకు ఆఫర్.. త్వరపడండి..(వీడియో)

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఉచితంగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఐటీఆర్‌ ఫైలింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఎంతో మందికి ఉపయోగకరంగా మారనుంది. ఎస్‌బీఐ ఈ తరహా సేవల కోసం ట్యాక్స్2విన్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Good news for SBI customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. అక్టోబరు 31 వరకు ఆఫర్.. త్వరపడండి..(వీడియో)

|

Updated on: Oct 13, 2021 | 9:21 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఉచితంగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఐటీఆర్‌ ఫైలింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఎంతో మందికి ఉపయోగకరంగా మారనుంది. ఎస్‌బీఐ ఈ తరహా సేవల కోసం ట్యాక్స్2విన్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యోనో యాప్ ద్వారా సులభంగా ఐటీఆర్ దాఖలు చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కావాల్సిందల్లా ఆరు డాక్యుమెంట్లు మాత్రమే. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

యోనోయాప్ ద్వారా ఐటీఆర్ దాఖ‌లు చేయడానికి కావ‌ల‌సిన ప‌త్రాలు ఏంటంటే పాన్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌, ఫారం 16, ప‌న్ను మిన‌హాయింపు వివ‌రాలు, వ‌డ్డీ ఆదాయం స‌ర్టిఫికేట్లు, ప‌న్ను ఆదా పెట్టుబ‌డికి సంబంధించిన‌ ఫ్రూఫ్‌లు. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు యోనోయాప్ ద్వారా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలంటే.. కస్టమర్‌ ముందుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోనో యాప్‌కి లాగిన్ కావాలి. షాప్స్ అండ్ ఆడ‌ర్స్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌ను సెల‌క్ట్ చేసుకుని అక్క‌డ క‌నిపించే ట్యాక్స్‌2విన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన స‌మాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను అనుసరించి ఐటీఆర్ సుల‌భంగా దాఖ‌లు చేయవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ : Danger Missed Video: వేగంగా దూసుకొచ్చిన కారు.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో..

 Kodiramakrishna Daughter: కోడి రామకృష్ణ కూతురు ఫస్ట్‌ సినిమా స్టార్ట్‌..! ఆశీస్సులు అందించిన సినీ పెద్దలు..(వీడియో)

 Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే ‘నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)

 Allu Arjun in Tahsildar office: ఆస్తుల విషయంలో తహశీల్దార్‌ ఆఫీసుకి వెళ్లిన అల్లు అర్జున్‌.. ఎగబడ్డ జనం..! అసలెందుకు వెళ్లారంటే..(వీడియో)

Follow us