AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun in Tahsildar office: ఆస్తుల విషయంలో తహశీల్దార్‌ ఆఫీసుకి వెళ్లిన అల్లు అర్జున్‌.. ఎగబడ్డ జనం..! అసలెందుకు వెళ్లారంటే..(వీడియో)

Allu Arjun in Tahsildar office: ఆస్తుల విషయంలో తహశీల్దార్‌ ఆఫీసుకి వెళ్లిన అల్లు అర్జున్‌.. ఎగబడ్డ జనం..! అసలెందుకు వెళ్లారంటే..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 13, 2021 | 8:46 AM

సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉండే స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయంలో కనిపించారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం వచ్చారని అనుకుంటున్నారా.. కాదండి బాబు..

సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉండే స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయంలో కనిపించారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం వచ్చారని అనుకుంటున్నారా.. కాదండి బాబు.. శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి అయిన తర్వాత ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను శంకర్‌పల్లి తహశీల్దార్‌ సైదులు బన్నీకి అందజేశారు. అయితే ఎమ్మార్వో కార్యాలయానికి బన్నీ వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే ఎమ్మార్వో కార్యాలయానికి బన్నీ వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అ‍ల్లు అర్జున్‌‌తో సెల్ఫీ దిగేందుకు ఎమ్మార్వో సిబ్బందితోపాటు అభిమానులు క్యూ కట్టారు. ఇక రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇదిలావుంటే.. ఇటీవలే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొనుగోలు చేయడం.. అక్కడ పెద్ద చర్చగా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Worlds Oldest Tree: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..! ఏమైంది అంటే..? (వీడియో )

 King Cobra drinking video: గ్లాస్‌లో నీళ్లు తాగుతోన్న కింగ్ కోబ్రా..! అదిరే వీడియో మీరూ చూసేయ్యాల్సిందే..!

 Poonam Kaur-PK Love: సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న ‘పూనమ్ కౌర్’ ట్వీట్.. #PK love అంటూ..

 Child-Snake Video: వ్యూస్‌ కోసం ఇంత దిగజారుతావా? ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుడ్డోడి వీడియో..