King Cobra drinking video: గ్లాస్‌లో నీళ్లు తాగుతోన్న కింగ్ కోబ్రా..! అదిరే వీడియో మీరూ చూసేయ్యాల్సిందే..!
పాములంటే ఎవరికి భయముండదు. పామును దూరం నుంచి చూస్తే చాలు మనుషులు హడలెత్తిపోతారు. అయితే ఇక్కడున్నది అట్లాంటి ఇట్లాంటి పాము కాదు ఏకంగా బ్లాక్ కింగ్ కోబ్రా. ఈ కింగ్ కోబ్రాకు ఓ మనిషి సాయం చేశాడు.
పాములంటే ఎవరికి భయముండదు. పామును దూరం నుంచి చూస్తే చాలు మనుషులు హడలెత్తిపోతారు. అయితే ఇక్కడున్నది అట్లాంటి ఇట్లాంటి పాము కాదు ఏకంగా బ్లాక్ కింగ్ కోబ్రా. ఈ కింగ్ కోబ్రాకు ఓ మనిషి సాయం చేశాడు. అదేంటి పాముకు మనిషి హెల్ప్ చేయడమేంటని అనుకుంటున్నారా.! అయితే ఈ వీడియోను మీరూ చూడాల్సిందే.!
జంతువులు మనుషులకు, అలాగే మనుషులు జంతువులకు సహాయం చేసే వీడియోలను ఎన్నో చూస్తుంటాం. అయితే మీరెప్పుడైనా మనిషి కింగ్ కోబ్రాకు హెల్ప్ చేయడం చూశారా.? అయ్యో.! పాముకు అంత కష్టమొచ్చిపడిందా.. అసలేం జరిగిందంటే.. వాతావరణ మార్పులు కారణంగా సూర్యుడి భగభగలకు ఓ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. ఓ ఇంటి ముందున్న లాన్ ఏరియాలోకి ప్రవేశించగా.. దాని అవస్థను చూసి ఒకతను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్లాస్‌లో నీళ్లు నింపి కోబ్రాకు అందించడం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. అది కూడా ఇంచక్కా తన దాహార్తిని తీర్చుకుంది.
ఒళ్లు గగుర్పోడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్ రియాక్షన్లతో హోరెత్తిస్తున్నారు. సుమారు 7 అడుగుల పొడువున్న ఆ పాముకు నీరు పట్టించిన అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వారం క్రిందట దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు 3.56 లక్షల మంది లైక్ కొట్టారు. లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ”కింగ్ కోబ్రాకే నీళ్లు పట్టించాదంతే.. వాడికి గుండె ధైర్యం ఎక్కువే” అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ”ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పాములతో జాగ్రతగా ఉండాలని.. కొంచెం అజాగ్రత్త వహించినా వ్యవహారం బెదిసికొడుతుందని” అని మరొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూసేయ్యండి.!
మరిన్ని చదవండి ఇక్కడ : Poonam Kaur-PK Love: సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న ‘పూనమ్ కౌర్’ ట్వీట్.. #PK love అంటూ..