Child-Snake Video: వ్యూస్ కోసం ఇంత దిగజారుతావా? ఓ రేంజ్‌లో ట్రోలింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుడ్డోడి వీడియో..
సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు వైరలవుతుంటాయి. వీటిలో కొన్ని బాగుంటే ఇంకొన్ని అంతగా మనకు నప్పవు. మంచి వీడియోలకు మనం అడక్కుండానే ప్రశంసలు దక్కుతాయి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలు కూడా అదే విధంగా వస్తాయి.
సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు వైరలవుతుంటాయి. వీటిలో కొన్ని బాగుంటే ఇంకొన్ని అంతగా మనకు నప్పవు. మంచి వీడియోలకు మనం అడక్కుండానే ప్రశంసలు దక్కుతాయి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలు కూడా అదే విధంగా వస్తాయి. తాజాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఓ వీడియోపై నెటిజన్లు కోపంతో కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ వ్రైట్ 20 ఏళ్ళుగా మొసళ్ల వేటగాడిగా పని చేస్తున్నారు. జనారణ్యంలోకి వచ్చిన మొసళ్లను గుర్తించి.. తిరిగి వాటి నివాస స్థలానికి తరలిస్తాడు. ఈ క్రమంలో మ్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశాడు. దీంట్లో తన రెండేళ్ల కొడుకు తన రెండు చేతులతో ఓ పెద్ద పాము తోకను పట్టుకుని లాగుతున్నాడు. ఈ దృశ్యం చూస్తే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఈ వీడియోపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు చిన్నారి సాహసాన్ని ప్రశంసించగా.. ఎక్కువ మంది మాత్రం కోపం వెళ్ళగక్కారు. . ‘‘ వ్యూస్ కోసం ఇంత దిగజారుతావా.. ఆ పిల్లాడు చిన్నవాడు. పాము.. దాని నైజం గురించి వాడికి తెలియదు. కానీ నీ బుద్ధి ఏమైంది. పొరపాటున ఆ పాము నీ కొడుకును కాటేస్తే ఏంటి పరిస్థితి. అదేం బొమ్మ కాదు. వాడు లోకం తెలియని చిన్నారి.. అదేమో విచక్షణ లేని జీవి. ఎందుకు ఇలా నీ కుమారుడి జీవితంతో ఆడుకుంటున్నావ్.. పామును ఇలా హింసిచడం న్యాయమా’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
మరిన్ని చదవండి ఇక్కడ : Tamannah-Anasuya-Master Chef: దారుణం.. టీఆర్పీ తగ్గిందని.. తమన్నాని తీసేశారు.. మరి మిల్క్ బ్యూటీ ప్లేస్‌లో ఎవరో తెలుసా..?