Danger Missed Video: వేగంగా దూసుకొచ్చిన కారు.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో..
రెప్పపాటులో తప్పించుకున్నాడు... వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కాయి... ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఈ వీడియో చూస్తే అది నిజంగా నిజమంటారు.. నిజంగానేరెప్పపాటులో ప్రాణాలు దక్కించుకోగలిగాడు ఓ అధికారి.
రెప్పపాటులో తప్పించుకున్నాడు… వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కాయి… ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఈ వీడియో చూస్తే అది నిజంగా నిజమంటారు.. నిజంగానేరెప్పపాటులో ప్రాణాలు దక్కించుకోగలిగాడు ఓ అధికారి. ఓ పోలీసు అధికారి సహోద్యోగినిని ప్రమాదం నుంచి కాపాడారు. అతను కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూఎస్ఏలో జరిగిన ఓ కారు ప్రమాదం నుంచి పోలీసు అధికారి తన సహోద్యోగిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వర్జీనియాలోని గేట్ సిటీ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసు కారు దగ్గర ఇద్దరు పోలీసులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ కారు వాళ్లపైకి వేగంగా దూసుకొచ్చింది. పక్కనే ఉన్న పోలీసు అధికారి వెంటనే స్పందించి తన మహిళా సహోద్యోగిని కాపాడారు. ఆమె పేరు జెస్సికా మెక్‌గ్రా, ఆమెను కాపాడిన అధికారి పేరు మాథ్యూ స్టీవర్ట్ అని తెలిపారు. ఈ ఘటన యూఎస్ హైవే నెం.23లో జరిగింది. ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత మాథ్యూ స్టీవర్ట్ కారు డ్రైవర్‌ను తనిఖీ చేశారు. జెస్సికా మెక్‌గ్రా అగ్నిమాపక, రెస్క్యూ యూనిట్లకు ఫోన్ చేశారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి పోలీసు కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Kodiramakrishna Daughter: కోడి రామకృష్ణ కూతురు ఫస్ట్ సినిమా స్టార్ట్..! ఆశీస్సులు అందించిన సినీ పెద్దలు..(వీడియో)
Worlds Oldest Tree: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..! ఏమైంది అంటే..? (వీడియో )
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

