Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే 'నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)

Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే ‘నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 13, 2021 | 8:55 AM

ప్రతి ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి కృషి చేసే వ్యక్తులు, సంస్ధలకు నోబెల్‌ శాంతి పురస్కారాలు వరిస్తుంటాయి. ఈ ఏడాది మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికయ్యారు. నార్వేజియాలోని నోబెల్‌ కమిటీ శాంతి పురస్కార విజేతలను ప్రకటించింది.

ప్రతి ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి కృషి చేసే వ్యక్తులు, సంస్ధలకు నోబెల్‌ శాంతి పురస్కారాలు వరిస్తుంటాయి. ఈ ఏడాది మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికయ్యారు. నార్వేజియాలోని నోబెల్‌ కమిటీ శాంతి పురస్కార విజేతలను ప్రకటించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం దాని పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసింది నోబెల్‌ కమిటీ. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్‌ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.

దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక బెదిరింపులు, దాడులు జరిగాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు.

మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో CNN పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Allu Arjun in Tahsildar office: ఆస్తుల విషయంలో తహశీల్దార్‌ ఆఫీసుకి వెళ్లిన అల్లు అర్జున్‌.. ఎగబడ్డ జనం..! అసలెందుకు వెళ్లారంటే..(వీడియో)

 Worlds Oldest Tree: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..! ఏమైంది అంటే..? (వీడియో )

 King Cobra drinking video: గ్లాస్‌లో నీళ్లు తాగుతోన్న కింగ్ కోబ్రా..! అదిరే వీడియో మీరూ చూసేయ్యాల్సిందే..!

 Poonam Kaur-PK Love: సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న ‘పూనమ్ కౌర్’ ట్వీట్.. #PK love అంటూ..