పూణే – ముంబైల మధ్య ఇంటర్ సిటీ కోచ్ ఈవీ ట్రాన్స్ బస్సులు.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన MEIL గ్రూప్

Intercity Coach EV Trans bus: దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ సంస్థ.. ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబైల మధ్య బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది.

పూణే - ముంబైల మధ్య ఇంటర్ సిటీ కోచ్ ఈవీ ట్రాన్స్ బస్సులు.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన MEIL గ్రూప్
Meil Intercity Coach Ev Trans Buses

MEIL Intercity Coach EV Trans buses: దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ సంస్థ.. ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబైల మధ్య బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది. పూర్తి కాలుష్య రహిత, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయాలన్న చిరకాల కల దీంతో నెరవేరబోతోంది. ఈ సేవలు దసరా నుంచి ప్రతిరోజు రెండు నగరాల మధ్య నడపనుంది. కేంద్ర ప్రభుత్వం, ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాలతో దేశీయ ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

కొత్తగా ప్రారంభించిన పూరీ బస్సు సేవలను వివరిస్తూ ఈవీ ట్రాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ రైజాడ, మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా ఇంటర్ సిటీ బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నందుకు గర్వకారణంగానూ, సంతోషంగా వుందన్నారు. ఇప్పటికే వివిధ నగరాల్లో ఎలక్ట్రిక్‌ ఇంట్రా సిటీ బస్సులను నిర్వహిస్తున్న ఈవీ ట్రాన్స్‌, ఇప్పుడు నగరాల మధ్య ఇంటర్‌ సిటీ రూట్లలో బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు లేని లోటును తీర్చినట్టయిందని తెలిపారు. పూరి బస్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే, 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో ఇంటర్‌ సిటీ సర్వీసులను ప్రారంభించాలనుకునే ఆపరేటర్లకు ఈ బస్సు ఒక అవకాశాన్ని కల్పిస్తోందని వివరించారు. కాలుష్యం లేని దూర ప్రాంత ప్రయాణాలకు ఈ బస్సులను వినియోగించడం ద్వారా భారీగా వ్యయాలను ఆదా చేయవచ్చని సందీప్‌ అన్నారు.

12 మీటర్ల పూరి బస్సు
కాలుష్య రహిత, ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ కోచ్ బస్సులో 45 మంది ప్రయాణీకులతో పాటు, డ్రైవర్, కో- డ్రైవర్ కూర్చునేందుకు వీలుంటుంది. అత్యంత సుందరంగా డిజైన్ చేసిన ఈ బస్సు ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి వీలుగా అత్యంత సౌకర్యవంతంగా పుష్ బ్యాక్ సీట్లతో డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక టీవీ, ఇన్ఫోటెయిన్‌మెంట్, వైఫై తో పాటు ప్రతి సీటుకు ఇన్‌బిల్ట్ యుఎస్‌బీ ఛార్జర్‌ను అమర్చడంతో ప్రయాణం వినోదాత్మకంగా ఉంటుంది. లగేజి కోసం 5 క్యూబిక్‌ మీటర్ల సువిశాల స్పేస్‌ను ఏర్పాటు వుంది.

ఆర్థికంగా ఆదా
డీజిల్‌ బస్సుతో పోల్చితే, పూరి ఎలక్ట్రిక్‌ బస్సును నిర్వహించడానికి అత్యంత తక్కువ వ్యయం కావడం వల్ల ఇంటర్‌ సిటీ బస్‌ ఆపరేటర్లకు ఆర్థికంగా చాలా ఆదా అవుతుంది. ఈ బస్సును లీ ఐయాన్‌ ఫాస్సేట్‌ బ్యాటరీ అమర్చడం ద్వారా, ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ట్రాఫిక్‌, ప్యాసింజర్‌ లోడ్‌లను బట్టి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ దేశీయంగా తయారు చేస్తున్నది.

భద్రతా ప్రమాణాలు
ఈ బస్సులో అనేక భద్రత పరికరాలను అమర్చారు. యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాల ప్రకారం ఎఫ్‌డీఎస్ఎస్ సిస్టమ్‌‌ను టీయువీ సర్టిఫికేషన్‌తో అమర్చారు. ఏడీఏఎస్‌ సిస్టమ్‌ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌), భారతీయ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఐటీఎస్‌ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే, ఎలాంటి ఆపత్కాలానైనా ఎదుర్కోనేందుకు ప్యానిక్‌ అలారమ్‌ సిస్టమ్‌, ప్రమాద సమాయాల్లో ఎమర్జెన్సీ లైటింగ్‌ సిస్టమ్‌ను కూడా అమర్చారు.

ఈవీ ట్రాన్స్‌ పూణే, సూరత్, సిల్వాస, గోవా, డెహ్రాడూన్‌, హైదరాబాద్ తదితర నగరాల్లో బస్సులను నడుపుతోంది. ఇంటర్‌ సిటీ సేవలను పూరీ బస్‌ పేరుతో ప్రారంభించడం ద్వారా, ఈవీ ట్రాన్స్‌ తన నిర్వహణ సామర్థ్యాలను మరోసారి నిరూపించుకుంది.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu