Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‎పై ఉత్కంఠ.. గురువారం కూడా కొనసాగనున్న వాదనలు..

అక్టోబర్ 2 న డ్రగ్స్ నిరోధక అధికారులు దాడులు చేసినప్పుడు షిప్‎లో ఆర్యన్ ఖాన్ లేడని అతని తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ముంబై కోర్టులో వాదించారు. అతనిపై మాదకద్రవ్యాల రవాణా ఆరోపణ అసంబద్ధమని న్యాయస్థానాని చెప్పారు...

Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‎పై ఉత్కంఠ.. గురువారం కూడా కొనసాగనున్న వాదనలు..
Aryan
Follow us

|

Updated on: Oct 13, 2021 | 7:08 PM

అక్టోబర్ 2 న డ్రగ్స్ నిరోధక అధికారులు దాడులు చేసినప్పుడు షిప్‎లో ఆర్యన్ ఖాన్ లేడని అతని తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ముంబై కోర్టులో వాదించారు. అతనిపై మాదకద్రవ్యాల రవాణా ఆరోపణ అసంబద్ధమని న్యాయస్థానానికి చెప్పారు. ఆర్యన్ డ్రగ్స్ ఉపయోగించలేదన్నారు. ఆర్యన్ ఖాన్ వద్ద నగదు లేదు కాబట్టి అతను డ్రగ్స్ కొనలేదని తెలిపారు. గంటకు పైగా అమిత్ దేశాయ్ తన వాదనలు వినిపించారు.

ఆర్యన్‌ సహా పలువురు తెలిసీ తెలియని వయసున్న యువకులని.. కొన్ని దేశాల్లో ఈ పదార్ధాలు చట్టబద్ధమేనని అమిత్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లంతా చిన్న పిల్లలు. బెయిల్ తోసిపుచ్చొద్దు. వాళ్ల పరిస్థితిని దయనీయంగా మార్చొద్దని.. వారు క్రమంగా మారుతారని తెలిపారు. అక్టోబర్ 3 న డ్రగ్స్ ఏజెన్సీ అధికారులు మారువేషంలో ముంబై క్రూయిజ్ షిప్‎లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేసినప్పుడు ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని చెప్పారు.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఎన్‎సీబీ తరఫు న్యాయవాది వాదించారు. విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ వాట్సప్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన వారి ఫోన్ నెంబర్లు దొరికాయని తెలిపింది. ఆయన మధ్యవర్తిగా ఉంటూ అక్రమంగా డ్రగ్స్ రవాణా జరిగిందన్న దానికి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు ఓ నివేదికను ఎన్‎సీబీ అధికారులు సమర్పించారు. ఆర్యన్ ఖాన్ మరో నిందితుడు అర్బాజ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని చెప్పారు. ఆ రోజు అతని వద్ద 6 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్ ను గురువారం వరకు వాయిదా వేసింది.

Read Also.. Myanmar: మయన్మార్‎లో దారుణం.. తిరుగుబాటుదారుల ఘర్షణలో 30 మంది సైనికులు మృతి..