AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt.Funds Scam: తెలంగాణలో తీగ లాగితే.. ఏపీలో డొంక కదులుతోంది.. తెలుగు అకాడమీ తరహాలో ఏపీలోనూ మోసం!

AP Government Funds Scam: సర్కారు సంస్థల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కన్నేసిన కేటుగాళ్లు కొల్లగొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు టెండర్ పెట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్.

AP Govt.Funds Scam: తెలంగాణలో తీగ లాగితే.. ఏపీలో డొంక కదులుతోంది.. తెలుగు అకాడమీ తరహాలో ఏపీలోనూ మోసం!
Ap Oil Fed, Ap State Warehousing Corporation
Balaraju Goud
|

Updated on: Oct 13, 2021 | 6:28 PM

Share

AP Government Funds Scam: సర్కారు సంస్థల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కన్నేసిన కేటుగాళ్లు కొల్లగొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు టెండర్ పెట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. తెలంగాణ తెలుగు అకాడమీ సొమ్ము కాజేసిన ఈ ముఠా ఏపీలోనూ రూ.15 కోట్ల ఎఫ్‌డీలు మాయం చేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణ సంస్థలు మొత్తం గుట్టును బయటపెడితే.. అసలు భాగోతం వెలుగులోకి రానుంది. బయటపడే మొత్తం ఎంతో మరి.

నిన్నటి వరకు తెలుగు అకాడమీ కేసు తెలంగాణలో కలకలం రేపింది. ఇప్పుడు అదే తరహా మోసం ఏపీలోనూ సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో తెలుగు అకాడమీ స్కామ్ తరహాలోనే ఏపీలోనూ మోసాలకు పాల్పడింది ఘరానా బ్యాచ్. పాత్రధారులు వేరేమోగానీ సూత్రధారులు మాత్రం ఒక్కరే. వాళ్లే సాయికుమార్ అండ్ బ్యాచ్. తెలుగు అకాడమీ నుంచి 80 కోట్ల రూపాయల వరకూ కొల్లగొట్టిన ముఠా.. ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులు గోల్ మాల్ చేసింది. 2009 నుంచి 2015 మధ్య కాలంలో ఏకంగా 15 కోట్ల రూపాయలు తన జేబుల్లో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ నుంచి రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ రూ.5 కోట్లు కాజేశారు.

ఈ రెండు సంస్థలు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకుల్లో మొత్తం 34 ఎఫ్‌డీలు చేశాయి ఈ సంస్థలు. అందులో భవానీపురం IOBలో 9 కోట్ల 60 లక్షల రూపాయలుగా గాను ప్రస్తుతం 12 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు అధికారులు. తెలంగాణలో మోసాలు బయటపడటంతో.. ఏపీ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే బ్యాంక్‌ల్లో ఉన్న ఎఫ్‌డీలను చెక్‌ చేయడంతో అందులో ప్రస్తుతం ఉన్న నిల్వల సంగతి తెలిసి అధికారులు షాక్‌కు గురయ్యారు. విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు APSWC సంస్థ ఎండీ శ్రీకంఠరెడ్డి.

మొత్తం 200 కోట్ల రూపాయల భారీ స్కామ్. రెండు రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. ఈ మొత్తం వ్యవహారంలో.. కీలక సూత్రధారి సాయి కుమార్. ఏపీకి చెందిన సంస్థల ఆఫీసులు హైదరాబాద్‌లో ఉండటంతో నిధులు కాజేసేందుకు స్కెచ్ వేసింది ఈ ఫేక్ ఎఫ్.డి.ల ముఠా. తెలంగాణలో జరిగిన మోసంలో తెలుగు అకాడమీకి చెందిన వ్యక్తులు, బ్యాంక్ అధికారులు, బ్రోకర్లు అంతా కలిసి దోచేశారు. అయితే, ఏపీలో ఫేక్ ముఠాకు సహకరించింది ఎవరు? బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా కోట్ల రూపాయలు ఎలా గల్లంతవుతాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Read Also…  పూణే – ముంబైల మధ్య ఇంటర్ సిటీ కోచ్ ఈవీ ట్రాన్స్ బస్సులు.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన MEIL గ్రూప్