Viral Video: బెంగుళూరులో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చేసిన అధికారులు.. ఎందుకు పడగొట్టారంటే..
కర్ణాటకలోని బెంగుళూరులో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా మరో భవనాన్ని మంగళవారం సాయంత్రం కూల్చివేశారు.
కర్ణాటకలోని బెంగుళూరులో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా మరో భవనాన్ని మంగళవారం సాయంత్రం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరు కమలా నగర్‌లోని నాలుగు అంతస్తుల భవనాన్ని పడగొట్టారు. ఎలాంటి ప్రాణ హాని జరగకుండా అగ్నిమాపక, అత్యవసర సేవా అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారు. భవనాన్ని కూల్చే ముందు ఆ భవనంలో నివసించే వారితోపాటు పరిసరాల్లో నివసించే వారందరిని ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి వసతితోపాటు ఆహారం ఏర్పాటు చేసినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఒక ప్రకటనలో తెలిపింది.
భారీ వర్షం కారణంగా ఆ భవనం కాస్త వంపుకు తిరిగింది. ఇలాంటివే నగరంలో ఉండటంతో బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ శిథిలావస్థ భవనాల జాబితా తయారు చేసింది. 26 భవనాలతో జాబితా తయారు చేసింది. అందులో కమలానగర్‌లోని భవనం ఒకటి. ఈ భవనంలో ఉన్న ఎనిమిది కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. బెంగళూరులో సోమవారం భారీ వర్షం కురిసింది. వానతో నగరం అంతటా వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీల్లు వచ్చాయి. మంగళవారం బెంగుళూరు విమానాశ్రయంలో, కొంతమంది ప్రయాణికులు టెర్మినల్ గేట్‌ల వద్దకు రావడానికి ట్రాక్టర్‌పై ప్రయాణించారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIAL) వెలుపల రహదారులు జలమయం కావడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
గత గురువారం బెంగుళూరులోని కస్తూరి నగర్‌లో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. బెంగుళూరు మున్సిపల్ కమిషనర్ గౌరవ్ గుప్తా జోనల్ కమిషనర్లను ప్రమాదకరమైన భవనాలు గుర్తించి కూల్చివేయాలని గతంలోనే ఆదేశించారు. సెప్టెంబర్ 27న బెంగళూరులోని లక్కసంద్ర ప్రాంతంలో 70 సంవత్సరాల పురాతన భవనం నేల కూలింది.
Yet Another Bengaluru Building Tilts, Evacuated, Then Demolished
The foundation of a two-storey building at Kamalanagar, in #Bengaluru gave way late last night while the sidewall of an old single-storey house collapsed in Nagarathpet today morning. There were no casualties. pic.twitter.com/PlVgaGxCua
— Subodh Kumar (@kumarsubodh_) October 13, 2021
Read Also.. Rahul Gandhi: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందే.. రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ బృందం..