AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veer Savarkar: మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్ అలా చేశారు.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

ఆంగ్లేయులకు వీర్ సావర్కర్ సరెండర్‌ అయ్యారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  బ్రిటీష్‌ వాళ్ల ముందు క్షమాభిక్ష వేడుకున్నట్లు రాశారని, అయితే ఇందులో నిజం లేదన్నారు.

Veer Savarkar: మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్ అలా చేశారు.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
Mahatma Gandhi, Veer Savarkar
Janardhan Veluru
|

Updated on: Oct 13, 2021 | 3:31 PM

Share

ఆంగ్లేయులకు వీర్ సావర్కర్ సరెండర్‌ అయ్యారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  బ్రిటీష్‌ వాళ్ల ముందు సావర్కర్ క్షమాభిక్ష వేడుకున్నట్లు రాశారని అన్నారు. అయితే వాస్తవం ఏంటంటే మెర్సీ పిటిషన్‌ వేయాలంటే ఖైదీలు వేసుకోవచ్చు.. మహాత్మాగాంధీ చెబితేనే సావర్కర్ బ్రిటీష్‌ వాళ్ల ముందు క్షమాభిక్ష పిటిషన్(మెర్సీ పిటిషన్) వేశారని అన్నారు. శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం మనం చేస్తున్నామని.. సావర్కర్‌ కూడా శాంతియుతంగానే పోరాటం చేస్తారని గాంధీజీ అన్నారని తెలిపారు. కాని బ్రిటీష్‌ వాళ్ల ముందు సావర్కర్‌ లొంగిపోయారని , క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని అభ్యంతరం చెప్పారు. సావర్కర్‌పై రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మార్క్సిస్ట్, లెనిన్ సిద్ధాంతాలు కలిగిన వారే సావర్కర్‌ను ఓ ఫాసిస్ట్‌గా చిత్రీకరించారని అభ్యంతరం చెప్పారు.  సావర్కర్ స్వాతంత్ర పోరాట యోధుడిగా కొనియాడారు. ఆయన 20వ శతాబ్ధపు భారత తొలి మిలిటరీ వ్యూహకర్తగా పేర్కొన్నారు. నిస్సందేహంగా సావర్కర్ ఓ గొప్ప జాతీయవాదిగా పేర్కొన్నారు. సావర్కర్‌కు బ్రిటీషులు రెండుసార్లు జీవితకాల కారాగార శిక్ష విధించారని.. ఆయన స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ఇది తార్కాణంగా పేర్కొన్నారు.

చరిత్రను వక్రీకరిస్తున్నారు.. అసద్ అభ్యంతరం

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను మస్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మహాత్మాగాంధీని జాతిపితగా తొలగించి సావర్కర్‌ను జాతిపిత చేస్తారంటూ ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ మర్డర్‌ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి , జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ దోషిగా తేల్చిన వ్యక్తి గురించి ఆబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Also Read..

Indian Railway: అది శుభ్రం చేయడానికి రైల్వేకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

India New Jersey: టీమిండియా కొత్త జెర్సీలు చూశారా..? ట్రోఫీ విన్నింగ్ జెర్సీలు ఇవేనంటూ నెట్టింట్లో సందడి చేస్తోన్న ఫ్యాన్స్..!