India New Jersey: టీమిండియా కొత్త జెర్సీలు చూశారా..? ట్రోఫీ విన్నింగ్ జెర్సీలు ఇవేనంటూ నెట్టింట్లో సందడి చేస్తోన్న ఫ్యాన్స్..!

T20 World Cup 2021: ఆదివారం నుంచి ఐసీసీ క్రీడోత్సవం మొదలుకానున్న సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను నేడు విడుదల చేసింది.

India New Jersey: టీమిండియా కొత్త జెర్సీలు చూశారా..? ట్రోఫీ విన్నింగ్ జెర్సీలు ఇవేనంటూ నెట్టింట్లో సందడి చేస్తోన్న ఫ్యాన్స్..!
India New Jersey
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2021 | 2:46 PM

Billion Cheers Jersey: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ సమరానికి వేళయింది. మరో నాలుగు రోజుల్లో యూఏఈ వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ పోరు మొదలు కానుంది. ఇప్పటికే చాలా జట్లు యూఏఈ చేరుకున్నాయి. అయితే ఐపీఎల్ 2021తో భారత ఆటగాళ్లంతా అక్కడే ఉన్నారు. ఆదివారం నుంచి ఐసీసీ క్రీడోత్సవం మొదలుకానున్న సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను నేడు విడుదల చేసింది. మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈ సారి కలర్ డోస్‌ను కొంచెం ఎక్కువగా ఉండేలా వీటిని తయారు చేశారు. మెన్‌ఇన్‌ బ్లూ కాస్త.. థిక్ బ్లూ‌గా మార్చేశారు. ఈమేరకు బీసీసీఐ సోషల్ మీడియాలో నూతన జెర్సీల ఫొటోలను పంచుకుంది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ బుమ్రా ఈ కొత్త జెర్సీలను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఈ మేరకు జెర్సీలోని నమూనాలు అభిమానుల బిలియన్ చీర్స్ నుంచి ప్రేరణ పొంది తయారు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. అందుకు అనుగుణంగానే జెర్సీలను డిజైన్ చేసినట్లు అందులో పేర్కొంది. ఈ కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్‌‌లో కనిపించనున్నారు. కొత్త జెర్సీలను నెట్టింట్లో పంచుకున్న వెంటనే ఫ్యాన్స్‌ నుంచి స్పందన భారీగా వస్తోంది. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. నైక్‌ సంస్థతో కాంట్రాక్ట్ పూర్తికావడంతో టీమిండియా కిట్‌ కొత్త స్పాన్సర్‌‌గా ఎంపీఎల్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ భారత ఆటగాళ్లకు నూతన కిట్‌లను అందజేసింది.

కాగా, సూపర్ 12 మ్యాచులు ఈ నెల 17 నుంచి మొదలు కానున్నాయి. భారత్ తన ప్రయాణాన్ని 24న మొదలు పెట్టనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తన తొలి మ్యాచును ఆడనుంది. ఆ తరువాత 31న న్యూజిలాండ్‌తో తలపడనుంది. నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌‌తో ఆడనుంది. ఇవి కాక క్వాలిఫయర్‌లో గెలిచిన టీంలతో మరో రెండు మ్యాచులు ఆడనుంది. ఇవి నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి.

Also Read: విధ్వంసం.. 114 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు 8 సిక్స్‌లు.. బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద బౌలర్‌..! బ్యాట్స్‌మెన్ల తలలు పగలకొట్టడం.. శిక్ష అనుభవించడం అతడికి కొత్తేమి కాదు..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?