Teamindia New Coach: సీనియర్లు వద్దు.. జూనియర్లే ముద్దంటోన్న రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పాత్రపై ఆసక్తి లేదంటోన్న దిగ్గజం..!

Rahul Dravid: సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు కోచ్ పాత్రను చేపట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చేసిన ప్రతిపాదనను మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే.

Teamindia New Coach: సీనియర్లు వద్దు.. జూనియర్లే ముద్దంటోన్న రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పాత్రపై ఆసక్తి లేదంటోన్న దిగ్గజం..!
Rahul Dravid
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2021 | 3:30 PM

Rahul Dravid: సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు కోచ్ పాత్రను చేపట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చేసిన ప్రతిపాదనను మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ అనంతరం తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ద్రవిడ్‌కు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే దీనిని రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడంట.

శాస్త్రితో పాటు, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో సహా ఇతర సహాయక సిబ్బంది పదవీకాలం ముగిసిపోనుంది. ఈమేరకు సీనియర్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ కూడా రాబోయే ప్రపంచ కప్ తర్వాత తన నిష్క్రమణను ధృవీకరించిన సంగతి తెలిసిందే.

ఇక ద్రవిడ్ విషయానికొస్తే, 48 ఏళ్ల ఈ మాజీ లెజెండ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)తో ఉన్నాడు. అలాగే అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా పనిచేస్తున్నాడు. సీనియర్ జట్టుతో ట్రావెల్ చేసేందుకు బీసీసీఐ ద్రవిడ్‌కు ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016, 2017 లో బీసీసీఐ అభ్యర్థనను తిరస్కరించి, కేవలం జూనియర్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు, ఎన్‌సీఏలో సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ద్రవిడ్ తన పర్యవేక్షణలో యువ ఆటగాళ్ల ప్రతిభను తీర్చిదిద్దాడు. అలాగే అండర్ 19 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలోనూ తన కీలకంగా వ్యవహరించాడు. దీంతో ప్రస్తుతం ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడగల నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లోనూ ఈ యువ ఆటగాళ్లు తమ సత్తాను చాటారు. అందుకే ద్రవిడ్‌ను సీనియర్ జట్టుకు కోచ్‌గా నియమించాలనే టాక్‌ కూడా ఎక్కువైంది.

ద్రవిడ్ ఇంతకుముందు 2018 లో భారతదేశ విదేశీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ఇటీవల జులైలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు కోచ్‌గా పనిచేశాడు. శాస్త్రి, అరుణ్, ‎విక్రమ్ రాథోర్‌లు సీనియర్ జట్టుతో ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు రాహుల్ ద్రవిడ్ పరిమిత ఓవర్ల జట్టుతో వెళ్లిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బీసీసీఐ నూతన కోచ్ వేటలో పడింది. ఈ వారంలో ఓ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే స్వదేశంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ లోపే కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

టీ 20 ప్రపంచకప్‌కు అర్హులైన భారత ఆటగాళ్లు, ఇతర సహాయక సిబ్బంది ప్రస్తుతం యూఏఈలోనే ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఎడిషన్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఐపీఎల్ 2021 అక్టోబర్ 15 న ముగుస్తుంది. దీని తరువాత అంటే అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Also Read: India New Jersey: టీమిండియా కొత్త జెర్సీలు చూశారా..? ట్రోఫీ విన్నింగ్ జెర్సీలు ఇవేనంటూ నెట్టింట్లో సందడి చేస్తోన్న ఫ్యాన్స్..!

విధ్వంసం.. 114 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు 8 సిక్స్‌లు.. బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!