T20 world Cup 2021: భారత్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు.. ఎందుకు రద్దు చేశారంటే..

యూఏఈ, ఒమన్‎లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌-2021లో ఇంగ్లాండ్‌తో భారత క్రికెట్ జట్టు మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది...

T20 world Cup 2021: భారత్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు.. ఎందుకు రద్దు చేశారంటే..
India
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 13, 2021 | 4:11 PM

యూఏఈ, ఒమన్‎లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌-2021లో ఇంగ్లాండ్‌తో భారత క్రికెట్ జట్టు మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కోహ్లీ అండ్ కో అక్టోబర్‌ 18న ఇంగ్లాండ్‌, అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‎లో తలపడాల్సి ఉంది. కానీ టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్ మార్చారు. ఇంగ్లాండ్‎తో రద్దు చేసి అక్టోబర్ 18 న సాయంత్రం 7:30 గంటలకు ఆస్ట్రేలియా, అక్టోబర్ 20 న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల వేదిక కూడా మార్చారు. టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్స్‌లో జరుగుతాయి. ముందుగా ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉండే.

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అక్టోబర్ 18 న టోలరెన్స్ ఓవల్‌లో పాకిస్థాన్‌తో తన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో అబుదాబిలో అక్టోబర్ 20న జరగనుంది. కాగా భారత్ అక్టోబర్ 24న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎తో తలపడనుంది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 17 నుండి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

Read Also.. Teamindia New Coach: సీనియర్లు వద్దు.. జూనియర్లే ముద్దంటోన్న రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పాత్రపై ఆసక్తి లేదంటోన్న దిగ్గజం..!