Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీమిండియా స్వ్కాడ్‌లో చేరనున్న యంగ్ ప్లేయర్? హార్ధిక్ ఫిట్‌నెస్‌పై ఇంకా డౌటే.. మరో రెండు రోజుల్లో ఏం జరగనుంది..!

హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయంలో భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో అతని స్థానంలో మరొక ఆటగాడిని చేర్చాలనే డిమాండ్ వెలుగులోకి వచ్చింది.

T20 World Cup: టీమిండియా స్వ్కాడ్‌లో చేరనున్న యంగ్ ప్లేయర్? హార్ధిక్ ఫిట్‌నెస్‌పై ఇంకా డౌటే.. మరో రెండు రోజుల్లో ఏం జరగనుంది..!
Hardik Pandya
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2021 | 4:48 PM

Hardik Pandya: టీ 20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టులో కొంత పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉంది. ఇందులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితి గురించి భారీ చర్చ నడుస్తోంది. హార్దిక్ ఫిట్‌నెస్ కారణంగా, జట్టులో అతని కొనసాగింపుపై ప్రశ్నలు నెలకొన్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ విషయంలో గందరగోళం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇటువంటి పరిస్థితిలో అక్టోబర్ 15 వరకు టీమ్ ఇండియాలో ఏదైనా మార్పు సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది? హార్దిక్ స్థానంలో మరొకరు చేరనున్నారా? లాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం బహుశా భారత సెలెక్టర్లు, టీం మేనేజ్‌మెంట్ హార్దిక్‌కు సంబంధించి ఒక ప్రత్యేక బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే జట్టులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 లో సంచలనం సృష్టించిన యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ని హార్దిక్ స్థానంలో చేర్చవచ్చని తెలుస్తోంది.

గత నెలలో భారత జట్టు ఎంపిక చేసే సమయంలో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ హార్దిక్ నాలుగు ఓవర్లు పూర్తి చేసే స్థితిలో ఉంటాడని తెలిపాడు. దీంతొ టీమిండియా ప్లేయింగ్ XI చాలా బలంగా ఉండనుందని అనిపించింది. కానీ యూఏఈలో ఆడుతున్న ఐపీఎల్ 2021 రెండవ భాగంలో, ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు హార్దిక్.. ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. మొదటి రెండు మ్యాచ్‌లలో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా హార్దిక్ తప్పుకున్నాడు. అప్పటి నుంచి హార్దిక్ బౌలింగ్ సామర్థ్యం, జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత జట్టు తన 15 మంది సభ్యుల బృందాన్ని అక్టోబర్ 15 వరకు మార్చే అవకాశం ఉంది. పీటీఐ తన నివేదికలో యూఏఈలోనే హార్దిక్ బయో బబుల్‌లో భాగం అవుతాడని, ఒక బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తుంది. హార్దిక్ ఫిట్‌నెస్ గురించి ప్రశ్నను పరిగణనలోకి తీసుకుంటే, సెలెక్టర్లు వెంకటేశ్ అయ్యర్‌ని జట్టులో చేర్చవచ్చని తెలుస్తోంది. యూఏఈలోనే వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ 2021‌లో అరంగేట్రం చేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఏదేమైనా, రిజర్వ్ ప్లేయర్‌గా ఆల్ రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ కూడా జట్టుతో ఉన్నాడు.

26 ఏళ్ల వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో యూఏఈలో అరంగేట్రం చేశాడు. కోల్‌కతా తరపున ఆడుతున్న వెంకటేష్ తన ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 41 పరుగులు చేశాడు. దీని తరువాత అయ్యర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్‌పై అర్ధ సెంచరీలతో సహా మరికొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది మాత్రమే కాదు వెంకటేశ్ మిడిల్ ఓవర్లలో మీడియం పేస్ బలాన్ని ప్రదర్శించాడు. ఆర్థికంగా బౌలింగ్‌తో పాటు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లలో 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 3 వికెట్లు కూడా ఉన్నాయి.

Also Read: T20 world Cup 2021: భారత్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు.. ఎందుకు రద్దు చేశారంటే..

Teamindia New Coach: సీనియర్లు వద్దు.. జూనియర్లే ముద్దంటోన్న రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పాత్రపై ఆసక్తి లేదంటోన్న దిగ్గజం..!