విధ్వంసం.. 114 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు 8 సిక్స్‌లు.. బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Cricket News: వన్డేల్లో కూడా డబుల్‌ సెంచరీ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ట్రావిస్ హెడ్ అనే క్రికెటర్ మరోసారి ఈ అద్భుతం

విధ్వంసం.. 114 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు 8 సిక్స్‌లు..  బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
Travis Head

Cricket News: వన్డేల్లో కూడా డబుల్‌ సెంచరీ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ట్రావిస్ హెడ్ అనే క్రికెటర్ మరోసారి ఈ అద్భుతం సృష్టించాడు. మార్ష్ కప్ అనే టోర్నమెంట్‌లో కేవలం 127 బంతుల్లో 230 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఈ కారణంగా అతని జట్టు 48 ఓవర్ల మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లకు 391 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ కాకుండా జాక్ విథెరాల్డ్ 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. క్వీన్స్‌ల్యాండ్ బౌలర్ల గురించి మాట్లాడితే..భారత సంతతి గురీందర్ సంధు 10 ఓవర్లలో 73 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి విజయవంతమయ్యాడు. దక్షిణ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పూర్తిగా ట్రావిస్ హెడ్‌పై ఆధారపడింది. అతని పరుగులు తీసివేస్తే మిగిలిన బ్యాట్స్‌మన్‌లు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.

సౌత్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ నాలుగో ఓవర్లో ఓపెనర్ అలెక్స్ కారీ (12) ని కోల్పోయింది. అప్పుడు కెప్టెన్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మన్ జాక్ విథెరాల్డ్‌తో రెండో వికెట్‌కు 244 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 36 వ ఓవర్‌లో ఈ జంట విడిపోయింది. గురీందర్ సంధు బౌలింగ్‌లో జాక్ విథెరాల్డ్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఉస్మాన్ ఖవాజాకి చిక్కాడు. అతను తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతని ఇన్నింగ్స్ చాలా బాగున్నప్పటికీ మరోవైపు పరుగుల వర్షం కురిపిస్తున్న ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌ ముందు చిన్నబోయిందనే చెప్పాలి.

రెండుసార్లు డబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడు
హెడ్ ​​65 బంతుల్లో మొదటగా సెంచరీని పూర్తి చేశాడు. సిక్సర్ కొట్టడం ద్వారా 100 పరుగుల మార్కును దాటాడు. 114 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇతను అలీ బ్రౌన్, రోహిత్ శర్మ తర్వాత 50 ఓవర్ల క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్. ట్రావిస్ హెడ్ చివరకు మైఖేల్ నెసర్ వేసిన 47 వ ఓవర్లో మార్నస్ లాబుస్కాగ్నేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దక్షిణ ఆస్ట్రేలియా 400 పరుగులు దాటుతుందని అనిపించింది. కానీ ఇది జరగలేదు. చివరి 36 పరుగులలో జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ కారణంగా జట్టు ఎనిమిది వికెట్లకు 391 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Gati Shakti launch: దేశ అభివృద్ధికి పీఎం గతిశక్తి.. ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu