Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gati Shakti launch: దేశ అభివృద్ధికి పీఎం గతిశక్తి.. ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ..

PM Gati Shakti Plan: ప్రతిష్ఠాత్మక "పీఎం గతిశక్తి" కార్యక్రమానకిి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు.

Gati Shakti launch: దేశ అభివృద్ధికి పీఎం గతిశక్తి.. ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 13, 2021 | 1:09 PM

కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. రూ. 100 లక్షల కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, అన్ని శాఖల మధ్య సమన్వయంతో ఈ గతిశక్తి కార్యక్రమాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. మౌలిక వసతులను  సమూలంగా మార్చే శక్తి ఈ కార్యక్రమానికి ఉన్నట్లు కేంద్రం నమ్ముతోంది. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి.

అనుమతుల్లో జాప్యాన్ని నివారించి మౌలిక వసతుల నిర్మాణాన్ని సంపూర్ణంగా, వేగంగా కొనసాగించడానికి గతిశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ.. గతిశక్తిపై ప్రకటన చేశారు.గతిశక్తితో పాటు భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం మోదీ ప్రారంభించారు. అంతకుముందు.. ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​ నమూనాను సమీక్షించారు ప్రధాని మోడీ.

వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..