Uthra Case Verdict: పామును ఉపయోగించి భార్యను చంపినందుకు డబుల్‌ జీవిత ఖైదు..

Uthra Case Verdict: పాముతో కాటు వేయించి భార్య చావుకి కారణమైన భర్తకు కేరళలోని కొల్లం కోర్టు డబుల్‌ జీవిత ఖైదు విధించింది. ఘోరమైన నేరానికి సానుభూతి అవసరం లేదని

Uthra Case Verdict: పామును ఉపయోగించి భార్యను చంపినందుకు  డబుల్‌ జీవిత ఖైదు..
Kerala Man
Follow us

|

Updated on: Oct 13, 2021 | 1:47 PM

Uthra Case Verdict: పాముతో కాటు వేయించి భార్య చావుకి కారణమైన భర్తకు కేరళలోని కొల్లం కోర్టు డబుల్‌ జీవిత ఖైదు విధించింది. ఘోరమైన నేరానికి సానుభూతి అవసరం లేదని ప్రకటించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం..సూరజ్ ఎస్‌ కుమార్, ఉత్రా 2018 లో వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో దాదాపు బంగారం, రూ.4 లక్షలు, ఒక కారును కట్నంగా ఇచ్చారు. ఉత్రా తండ్రి ప్రతి నెలా రూ .8,000 ఇచ్చేవారు. అయినా సూరజ్ అదనపు కట్నం కోసం ఉత్రాని వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయడానికి పథకం వేశాడు. తన మీదకి ఎటువంటి అనుమానం రాకుండా పామును ఉపయోగించి చంపాలని నిర్ణయించుకున్నాడు.

మే 7, 2020 న భార్యకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై నాగుపామును వదిలాడు. అయితే పాము కాటుకు గురైనట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 52 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది. అయితే ఎలాగైనా అంతమొందించాలని సూరజ్‌ ఆస్పత్రిలో నిద్రిస్తుండగా మరో పాముని ఆమెపై వదిలాడు. ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఆ మహిళ మొదటి పాము కాటు నుంచి బయటపడింది కానీ రెండో సారి పాము కాటువల్ల మరణించిందని తేల్చారు.

అయితే ఈ విషయం అతడికి పాములు అందించిన సురేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అప్పుడు ఆశ్చర్యరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను సూరజ్‌ అనే వ్యక్తికి పాములను ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు వాటిని ఎలా ఇతరులపై పంపించాలో శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపాడు. అయితే అల్లుడిపై అనుమానం ఉన్న సదరు మహిళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే కోర్టులో నేరం రుజువు కావడంతో ఐపిసి సెక్షన్ 302 ప్రకారం సూరజ్‌కు రూ. 5 లక్షల జీవిత ఖైదు, సెక్షన్ 307 కింద నేరానికి రూ. లక్ష, జీవితకాలం జైలు శిక్ష, సెక్షన్ 328 కింద నేరానికి 10 సంవత్సరాలు, సెక్షన్ 201 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. మొత్తం 17 సంవత్సరాల తర్వాత జీవిత ఖైదు ప్రారంభమవుతుందని కోర్టు ప్రకటించింది.

సైబర్‌ మోసాల తర్పీదు కోసం స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్.. రాచకొండ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే