AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC సంచలన నిర్ణయం..! అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు PhD అవసరం లేదు.. ఎప్పటివరకంటే..?

UGC: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి అర్హతగా పిహెచ్‌డి తప్పనిసరని గతంలో UGC నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా

UGC సంచలన నిర్ణయం..! అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు PhD అవసరం లేదు.. ఎప్పటివరకంటే..?
Ugc
uppula Raju
|

Updated on: Oct 13, 2021 | 11:10 AM

Share

UGC: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి అర్హతగా పిహెచ్‌డి తప్పనిసరని గతంలో UGC నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా దీనిని సడలించింది. UGC కొత్తగా జారీ చేసిన ప్రకటన ప్రకారం “జూలై 1, 2021 నుంచి యూనివర్సిటీల విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి PhD అవసరం లేదని తేల్చింది. అయితే ఇది జూలై 1, 2023 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (DUTA) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. దీనివల్ల యూనివర్సిటీలోని వివిధ విభాగాలలోని తాత్కాలిక ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం లభించింది. ఢిల్లీ యూనివర్సిటీ ఇటీవల 251 పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

UGC NET పరీక్ష వాయిదా UGC NET పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. యుజిసి నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష పూర్తి వివరాలను చూడటానికి అధికారిక వెబ్‌సైట్- ugcnet.nta.nic.in ని సందర్శించవచ్చు. NTA జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పరీక్ష అక్టోబర్ 17 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. అయితే ఆ రోజులలో అనేక ఇతర పరీక్షల ఉండటంతో పరీక్షను వాయిదా వేశారు. NTA విడుదల చేసిన సమాచారం ప్రకారం.. అడ్మిట్ కార్డులో పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్, అభ్యర్థుల సమయం గురించి సమాచారం ఉంటుంది. UGC NET పరీక్ష రోజున అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు NTA వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన హాల్‌ టికెట్‌, ఒక సాధారణ బాల్ పాయింట్ పెన్, అదనపు ఫోటో కలిగి ఉండాలి.

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు