AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదాస్పద బౌలర్‌..! బ్యాట్స్‌మెన్ల తలలు పగలకొట్టడం.. శిక్ష అనుభవించడం అతడికి కొత్తేమి కాదు..

Cricket News: క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్ అంటారు. కానీ ఈ గేమ్‌లో కూడా చాలా గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ఇంగ్లాండ్‌కి చెందిన ఓ బౌలర్ సృష్టించిన

వివాదాస్పద బౌలర్‌..! బ్యాట్స్‌మెన్ల తలలు పగలకొట్టడం.. శిక్ష అనుభవించడం అతడికి కొత్తేమి కాదు..
John Snow
Follow us
uppula Raju

|

Updated on: Oct 13, 2021 | 10:44 AM

Cricket News: క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్ అంటారు. కానీ ఈ గేమ్‌లో కూడా చాలా గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ఇంగ్లాండ్‌కి చెందిన ఓ బౌలర్ సృష్టించిన ఆటంకాలు అన్నీ ఇన్నీ కావు. బౌన్సర్‌తో ఒకరి తల పగలగొట్టారు. అందుకే అతడి పేరు చెబితే చాలు బ్యాట్స్‌మెన్‌ల మనసులో గుబులు పుడుతుంది. అతడు ఎవరో కాదు 60 వ దశకంలో ఇంగ్లండ్‌లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన జాన్ స్నో. అతను 30 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్ కోసం విధ్వంసం సృష్టించారు. ఈ రోజు అతడి 80 వ పుట్టినరోజు. అతడి కెరీర్‌ గురించి తెలుసుకుందాం.

జోన్ స్నో తన 24 వ ఏట1965 లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశారు. కానీ అతని నిజమైన ఆట 30 సంవత్సరాల వయస్సులో ఆడారు. అతను తన టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మైదానంలో బంతితో బ్యాట్స్‌మన్ తలపగలకొట్టారు. ఇది మాత్రమే కాదు 1971 లో జోన్ స్నో, సునీల్ గవాస్కర్ మధ్య వివాదం కూడా జరిగింది. 1971 సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులకే 7 వికెట్లు సాధించారు. ఇది అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. ఈ మొత్తం మ్యాచ్‌లో జోన్ స్నో 8 వికెట్లు తీశారు.

ఈ టెస్టులో ఇంగ్లాండ్ 299 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిడ్నీలో జరిగిన అదే సిరీస్‌లోని 7 వ టెస్టులో ఇంగ్లాండ్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోన్ స్నో 2 వికెట్లు తీశారు. కానీ ఈ మ్యాచ్‌లో ఒక బౌన్సర్ కారణంగా వార్తల్లో నిలిచారు. అతని బౌన్సర్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ టెర్రీ జెన్నర్ తలను పగలగొట్టింది. అయితే ఇది టెర్రీ జెన్నర్‌ని పెద్దగా బాధించలేదు. కానీ ఈ సంఘటన తర్వాత స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుడు మైదానంలో దిగి అతని కాలర్ పట్టుకున్నాడు. అతను బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇది సంఘటన జరిగింది.

గవాస్కర్‌తో రచ్చ ఈ సంఘటన 1971లో భారత ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించినది.1971 లో ఇంగ్లాండ్‌లో భారతదేశం మొదటి టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు మూడో టెస్టులో పరుగులు తీస్తున్న సునీల్‌ గవాస్కర్‌కి అడ్డు తగిలారు. స్నో దీన్ని ఉద్దేశపూర్వకంగా చేశారు. తర్వాత ఈ చర్యలకు క్షమాపణలు చెప్పారు కానీ బదులుగా రెండు మ్యాచ్‌లలో పాల్గొనకుండా బోర్డు వేటు వేసింది. జోన్ స్నో ఇంగ్లాండ్ కోసం మొత్తం 49 టెస్టులు ఆడారు. ఇందులో అతను 26.66 సగటుతో 202 వికెట్లు తీసుకున్నారు. అతను 9 వన్డేలు ఆడారు, 14 వికెట్లు తీసుకున్నారు. 1976-77లో కెర్రీ ప్యాకర్ సిరీస్ ఆవిర్భవించినప్పుడు జోన్ స్నో కూడా అందులో భాగమయ్యారు. అతను కెర్రీ ప్యాకర్ సిరీస్‌లో ఆడటం ద్వారా చాలా డబ్బు సంపాదించారు. తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించినప్పుడు అతను ఆ డబ్బుతో తన సొంత ట్రావెల్ ఏజెన్సీని స్థాపించారు.

నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటున్నారా ? అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..