Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. కోల్‌కత్తాతో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఓటమితో మరోసారి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీకి అందని ద్రాక్షే అయ్యింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 13, 2021 | 11:09 AM

Gautam Gambhir Comments on Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. కోల్‌కత్తాతో సోమవారం జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో మరోసారి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీకి అందని ద్రాక్షే అయ్యింది. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. ఆర్సీబీకి ఐపీఎల్ కప్ సాధించిపెట్టాలన్న కోహ్లీ చిరకాల వాంఛ నెరవేరలేదు. కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ ఎనిమిది ఐపీఎల్ సిరీస్‌లు ఆడగా.. ఒక్క సిరీస్‌లోనూ టైటిల్ గెలవలేకపోయింది. ఐపీఎల్‌లో మొత్తం 140 మ్యాచ్‌లలో ఆర్సీబీ జట్టుకు సారథ్యంవహించిన కోహ్లీ 70 మ్యాచ్‌లలో ఓటమి చెందగా.. 66 మ్యాచ్‌లలో విజయం దక్కించుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ చూపిన ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ(6076)ని తక్కువగా చూడడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిందని విశ్లేషించారు. బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ విషయంలో కోహ్లీకి క్లారిటీ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మిగిలిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరీ ఎక్కువ మార్పులు చేసేవి కావాలని గుర్తుచేశారు. వీలైనంత మేరకు బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్‌ను యధాతథంగా కొనసాగించేవారని అన్నారు. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ నిరాశపరిచినా.. ఓ ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇచ్చారని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే అన్నట్లు గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

కోహ్లీ గొప్ప నాయకుడు..

ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడని ఆర్సీబీ ఆటగాడు హర్షల్ పటేల్ అన్నాడు. ఆర్సీబీ జట్టుకు కోహ్లీ అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి తర్వాత మాట్లాడిన అతడు.. తమ ప్రణాళికలను అమలు చేసేందుకు బౌలర్లకు కోహ్లీ స్వేచ్ఛనిస్తాడని చెప్పాడు. 2021 నుంచి కోహ్లీతో తాను ఆడుతున్నానని గుర్తు చేసిన హర్షల్.. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నంత మాత్రా అతన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదన్నాడు.

Also Read..

MS Dhoni: ఎంఎస్ ధోనీ గొప్పతనం.. ఆసక్తికర విషయం వెల్లడించిన గంగూలీ

వివాదాస్పద బౌలర్‌..! బ్యాట్స్‌మెన్ల తలలు పగలకొట్టడం.. శిక్ష అనుభవించడం అతడికి కొత్తేమి కాదు..