నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటున్నారా ? అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహయపడుతుంది..

నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటున్నారా ? అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Jaggery Ghee

బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహయపడుతుంది.. రోజూ ఉదయాన్నే బెల్లం తీసుకోవడం వలన అనేక లాభాలున్నాయి. అలాగే నెయ్యి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారం రుచిని పెంచడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవడం వలన అనేక లాభాలున్నాయి. ఆయుర్వేదంలో నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవడం వలన శరీరం ఫిట్‏గా ఉంటుంది. అయితే బెల్లం.. నెయ్యి కలిపి ఎప్పుడు.. ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యాహ్న భోజనం తర్వాత నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకోకపోతే.. రాత్రిళ్లు తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక స్పూన్ నెయ్యిని తీసుకుని అందులో చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి.. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత తినాలి.

బెల్లెంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం.. విటిమన్స్ బి, సీ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. నెయ్యిలో విటమిన్ ఎ.కె.ఇ.డీలతోపాటు.. దేశీ నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బెల్లం.. నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మం, జట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది.

నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. శరీరం, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

Also Read: God Father: గాడ్ ఫాదర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు సినిమా కోసం రంగంలోకి ఆ ఫేమస్ పాప్ సింగర్ ?..

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ

Pooja Hegde Birthday : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షులమనసులో స్థానం సంపాదించుకున్న పూజా పుట్టినరోజు నేడు..

RGV’s Konda: అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu