Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God Father: గాడ్ ఫాదర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు సినిమా కోసం రంగంలోకి ఆ ఫేమస్ పాప్ సింగర్ ?..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మరిపోయారు.. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు..

God Father: గాడ్ ఫాదర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు సినిమా కోసం రంగంలోకి ఆ ఫేమస్ పాప్ సింగర్ ?..
God Father
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 13, 2021 | 9:47 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మరిపోయారు.. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు.. గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‏గా గాడ్ ఫాదర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీని.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటేస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఫేమస్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్‏తో ఓ సాంగ్ పాడించనున్నట్లుగా టాక్.. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఒక పాట కోసం బ్రిట్నీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. బ్రిట్నీ అమెరికా పాప్ సింగర్.. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు.

Pop Singer

Pop Singer

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో బ్రిట్నీ పాట పాడింది. ఇక మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ సాంగ్ పాడబోతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే గాడ్ ఫాధర్ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లుగా టాక్. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మూవీ కాకుండా.. చిరంజీవి… భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

Also Read: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ

Pooja Hegde Birthday : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షులమనసులో స్థానం సంపాదించుకున్న పూజా పుట్టినరోజు నేడు..

Tamannah-Anasuya-Master Chef: దారుణం.. టీఆర్పీ తగ్గిందని.. తమన్నాని తీసేశారు.. మరి మిల్క్ బ్యూటీ ప్లేస్‌లో ఎవరో తెలుసా..?

RGV’s Konda: అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ