Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ

సినిమా పరిశ్రమలో మా ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుంది. రోజుకో మలుపులతో రసవత్తరంగా మారుతుంది. సై అంటే సై అంటూ సాగిన

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ
Krishna Mohan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 13, 2021 | 8:30 AM

సినిమా పరిశ్రమలో మా ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుంది. రోజుకో మలుపులతో రసవత్తరంగా మారుతుంది. సై అంటే సై అంటూ సాగిన పోరులో మంచు వర్గం గెలుపొందగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. దీంతో ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మా వెనుక మేముంటాం.. మాలో సంక్షేమం జరగాలి.. మంచు విష్ణును ప్రతినెలా ప్రోగ్రస్ కార్డు అడుగుతాం.. ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు.. ఇక అక్టోబర్ 10న జరిగిన ఎన్నికలు చాలా గందరగోళంగా జరిగాయని.. మోహన్ బాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను ఇష్టానుసారంగా తిడుతూ.. కొట్టడానికి వచ్చారని ఆ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఇక అలాగే అసభ్య పదజాలంతో మమ్మల్ని దూషించారని.. మంచు విష్ణు, మనోజ్ అక్కడ లేకపోయి ఉంటే.. పరిస్థితి దారుణంగా మారిపోయి ఉండేదని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా.. ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను తమ ఇంటికి తీసుకువెళ్లారని.. ఎందుకని ప్రశ్నిస్తే… తనకు హక్కు ఉందని ఆరోపించారు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు. తాజాగా ఈ ఆరోపణలపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వివరణ ఇచ్చారు… బ్యాలెట్ పేపర్లను మా ఇంటికి తీసుకువెళ్లాననేది అవాస్తవం.. పూర్తిగా నిరాధారమైన ఆరోపణ.. బ్యాలెట్ పేపర్లను భద్రపరిచిన బాక్సుల తాళాలు మాత్రమే తీసుకువెళ్లాను.. బ్యాలెట్ పేపర్లు కాదు అన్నారు కృష్ణమోహన్.. ఎవరో బ్యాలెట్ పేపర్స్ ఇంటికి తీసుకెళ్లారట.. బయట టాక్ అని యాంకర్ అనసూయ ట్వీట్ చేయడం… ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని అని నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో బుల్లితెర నటుడు ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఆరోపణలపై కృష్ణమోహన్ స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అలాగే అనసూయ ఎన్నికైనట్టు ప్రకటించామన్న వార్తలు సైతం నిజం కాదని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.

Also Read: RGV’s Konda: అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ

Rajinikanth’s Annaatthe: భారీ ధరకు అమ్ముడుపోయిన సూపర్ స్టార్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్..