RGV’s Konda: అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మించబడుతున్నచిత్రం "కొండా".

RGV's Konda: అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ
Konda

RGV’s Konda: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మించబడుతున్నచిత్రం “కొండా”. వరంగల్ లోని కొండా మురళి మరియు కొండా సురేఖ గార్ల జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న చిత్రం “కొండా”. . ఈ చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంతఊరు వంచనగిరి లో ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయం లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. వరంగల్ ప్రజలు ఈ చిత్రం ఓపెనింగ్ కి తండోపతండాలుగా వచ్చారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ కొండా మురళి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ .. సైకిల్ మీద టమాటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి మురళి. అటువంటి వ్యక్తి  ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అన్నారు. ఆయన ప్రజాభిమానం తోటే స్వతహాగా ఎదిగాడానేది మన అందరికీ తెలుసు.. అలాంటి వ్యక్తి  బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి అని సురేఖ అన్నారు. అలాగే .. ఆమె మాట్లాడుతూ.. మా పైన విమర్శలు చేసే వారిని నేను ఒక్కటే సవాల్ చేస్తున్న మీకు ధైర్యం ఉంటే మీ బయోపిక్ లు తీసుకోండి మీ సొంత పైసలు పెట్టే చేయించుకోండి… ఆర్జీవి అన్న లాంటి డైరెక్టర్ తో తీసుకోండి మేము కాదనము. మా కథ వెనుక ఒక చరిత్ర ఉంది. మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది . మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరందరూ కూడా పెత్తందార్లు , భూస్వాములు, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు .. ఎంతసేపు పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళు.. కానీ పేదవాడిని ప్రేమించేటువంటి మనసున్న వ్యక్తి మురళి గారు.. పేదవాడికి పైకి తీసుకువచ్చే గొప్ప వ్యక్తి  మురళి గారు. ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా దానమిచ్చే వ్యక్తి . ఈ గ్రామంలో మన అందరికీ తెలుసు స్కూలు ,జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్ భూములు గాని ఇవన్నీ ఆయన ప్రజల కోసం ఇవ్వకపోతే కోట్ల రూపాయలను సొమ్ముచేసుకొనే వాడు. డబ్బుకు ఆశించకుండా తన భూమిని కూడా ఇచ్చేసినటువంటి వ్యక్తి మురళి. దర్శకుడు ఆర్జీవీ గారు మమ్మల్ని గుర్తించి ముందుకొచ్చి కొండా సినిమా చేస్తానని ధైర్యంగా చెప్తున్నారు. అన్నిటికంటే మంచి కథను ఇస్తున్నాం అని చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు మురళి గారు లో ఉన్నాయి కాబట్టి ఆర్జివి గారు ముందుకు వచ్చారు అని నేను ఆశిస్తున్నాను అని అన్నారు కొండాసురేఖ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

New Technology: గోడ అవతల ఉన్నవారిని గుర్తించే పరికరం రెడీ.. శత్రు జాడల్ని గుర్తించడం ఇక ఈజీ!

Nepal Bus Accident: పండుగ పూట విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 28 మంది దుర్మరణం!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu