AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్ట్.. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులలో మరో కొత్త ఫంగస్‌.. మూడు నెలల్లో 4 కేసులు

Covid-19: బ్లాక్‌ ఫంగస్‌ తర్వాత పూణెలోని నలుగురు కొవిడ్‌ పేషెంట్లలో వైద్యులు మరో కొత్తరకం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది ఆరోగ్య నిపుణులలో ఆందోళను

అలర్ట్.. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులలో మరో కొత్త ఫంగస్‌.. మూడు నెలల్లో 4 కేసులు
New Fungus
uppula Raju
|

Updated on: Oct 13, 2021 | 9:56 AM

Share

Covid-19: బ్లాక్‌ ఫంగస్‌ తర్వాత పూణెలోని నలుగురు కొవిడ్‌ పేషెంట్లలో వైద్యులు మరో కొత్తరకం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది ఆరోగ్య నిపుణులలో ఆందోళను పెంచుతోంది. వాస్తవానికి కోవిడ్ -19 నుంచి కోలుకున్న ఒక నెల తర్వాత ప్రభాకర్ అనే 66 ఏళ్ల రోగి తేలికపాటి జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. ప్రారంభంలో అతనికి కండరాల సడలింపుపై మందులు ఇచ్చారు కానీ ఇది అతనికి ఉపశమనం కలిగించలేదు. చికిత్స సమయంలో ఆ రోగి మాగ్నెట్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MII) స్కాన్ చేశారు.

అప్పుడు అతని శరీరంలో స్పాండిలోడిస్కిటిస్ అని పిలువబడే వెన్నెముక-డిస్క్ ప్రదేశాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఎముక క్షీణించినట్లు గుర్తించారు. బయాప్సీ నివేదికలో అతని ఎముకలో ఆస్పర్‌గిల్లస్ జాతులు పెరుగుతున్నట్లు గుర్తించారు. నిజానికి ఇది ఒక రకమైన ఫంగస్. వైద్య పరంగా దీనిని ఆస్పెర్‌గిల్లస్ ఆస్టియోమైలిటిస్ అంటారు. ఈ ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వెన్నెముక క్షయ సోకుతుంది. కాబట్టి చికిత్స చేయడం చాలా కష్టం. కోవిడ్ నుంచి కోలుకున్న రోగులలో కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తులలో ఈ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్ వైద్యుడు మాట్లాడుతూ.. “మేము ఈ ఫంగస్‌ను మూడు నెలల్లో నలుగురు రోగులలో చూశాం” అని చెప్పాడు.

కొవిడ్‌ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ ఈ కొత్త ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న నలుగురు పేషెంట్లు గతంలో తీవ్రమైన కొవిడ్, న్యుమోనియాతో బాధపడ్డారు. అందుకే కోలుకోవడానికి స్టెరాయిడ్‌లతో చికిత్స చేశారు. ఆ ఎఫెక్ట్‌ కూడా ఈ ఫంగస్‌ పెరగడానికి దారి తీసినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే కొత్త ఫంగస్‌పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Crime: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని ఓ కసాయి తనయుడు ఏం చేశాడంటే..

Follow Us
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!