Gorilla in caretakers lap: సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిన సెలబ్రిటీ గొరిల్లా.. హృదయాలను కదిలిస్తున్న గొరిల్లా మరణం వీడియో..

Gorilla in caretakers lap: సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిన సెలబ్రిటీ గొరిల్లా.. హృదయాలను కదిలిస్తున్న గొరిల్లా మరణం వీడియో..

Anil kumar poka

|

Updated on: Oct 13, 2021 | 9:50 AM

ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న గొరిల్లా తన అలనాపాలనా చూసుకున్న సంరక్షుడి ఒడిలో తాజాగా ప్రాణాలొదిలింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అడవిలో తల్లి గొరిల్లా మృతదేహాన్ని పట్టుకుని వదలకుండా ఉన్న రెండేళ్ళ పిల్ల గొరిల్లాను రేంజర్లు గుర్తించారు.

ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న గొరిల్లా తన అలనాపాలనా చూసుకున్న సంరక్షుడి ఒడిలో తాజాగా ప్రాణాలొదిలింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అడవిలో తల్లి గొరిల్లా మృతదేహాన్ని పట్టుకుని వదలకుండా ఉన్న రెండేళ్ళ పిల్ల గొరిల్లాను రేంజర్లు గుర్తించారు. సంరక్షణ కేంద్రంలో ఉంచి పెంచుకున్నారు. గొరిల్లాకు ఎన్‌డకాసి అనే పేరు పెట్టారు. 2019లో తన సంరక్షకుడు ఆండ్రీతో కలిసి గొరిల్లా దిగిన సెల్ఫీ ఫొటో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ గొరిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పలు టీవీ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలను చిత్రీకరించారు. విరుంగ అనే డాక్యుమెంటరీలో కూడా ఈ ఆడ గొరిల్లా భాగమైంది.

ఎంతో పాపులారిటీ సంపాదించిన గొరిల్లా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడింది. ఈ మధ్య దాని ఆరోగ్యం మరింతగా క్షిణించింది. దాంతో తన ఏకైక స్నేహితుడు, సంరక్షకుడు ఆండ్రీ బౌమా చేతుల్లో సెప్టెంబర్‌ 26న తుదిశ్వాస విడిచింది. విరుంగా నేషనల్ పార్క్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘దశాబ్దానికి పైగా పార్క్‌లోని సెంటర్ సంరక్షణలో ఉన్న గొరిల్లా ‘ఎన్‌డకాసి’ మరణాన్ని ప్రకటించడం ఎంతో బాధగా ఉంది” అని అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కాగా గొరిల్లా సంరక్షకుడు అండ్రీ బౌమా దాని మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ‘ఎంతో ప్రేమ చూపించే జీవిని సంరక్షించడం నా అదృష్టం. చాలా చిన్న వయస్సులో ఎన్‌డకాసి అనుభవించిన బాధను అర్థం చేసుకుని దగ్గరకు చేర్చాం. మానవులు తమ శక్తి, సామర్థ్యాలతో గ్రేట్‌ ఏప్స్‌ను ఎందుకు కాపాడాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకున్నాను’ అన్నారు. ఒక చిన్నారిగా ప్రేమించానని, దాంతో సంభాషించిన ప్రతిసారీ తన ముఖంలో చిరునవ్వు వెలిగేదంటూ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch: కోతలొద్దు, మా వాటా వాడుకోండి , తొందర్లోనే పిల్లలకు టీకా.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 Viral Video: మనిషి స్వార్ధానికి పరాకాష్ట ఈ ఘటన..! చెట్లు నాటడం ఛాలెంజ్ ఓ వైపు.. చెట్లు పీకేయడం మరో వైపు.. (వీడియో)

 Ratan TATA-Air India: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న రతన్‌ టాటా..! నష్టాలని లాభాల్లోకి ఇలా..!(వీడియో)

 Good news for SBI customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. అక్టోబరు 31 వరకు ఆఫర్.. త్వరపడండి..(వీడియో)