Viral Video: ఇదేం రుచి రా బాబు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ దోశ.. ఎలా చేశారో చూడండి..
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. ఆత్మ రాముడిని సంతృప్తి పరచాడనికే.. మనుషులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. ఆత్మ రాముడిని సంతృప్తి పరచాడనికే.. మనుషులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ ఒత్తిడి.. కుటుంబ సమస్యల ఒత్తిడి.. అలసట.. మనస్సు ప్రశాంతంగా లేకపోతే.. అస్సలు ముద్ద కూడా ముట్టరు చాలా మంది. అలాగే.. నోటికి నచ్చే రుచి కోసం తాపత్రయ పడుతుంటారు. మన భారతదేశంలో అనేక రకాల సంప్రదాయ వంటకాలు.. రుచులు ఉన్నాయి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు.. ఒక్కో ప్రాంతంలో ఒక్క ఆహారం.. ఒక్కో విధంగా చేస్తుంటారు. అలాగే.. రోజు తినే ఆహారాన్నే కాస్త మార్చి విభిన్నంగా ట్రై చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి విభిన్న రకాల వంటకాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆలోచించాలే కానీ.. రానిది ఏముంది. ప్రస్తుతం ఒక విచిత్ర వంటకం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దోశ.. చిన్నా, పెద్ద నుంచి ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఏకైక ఆహారం. దోశలు పలు రకాలు కూడా ఉన్నాయి. అనియన్ దోశ.. ఉల్లిదోశ.. ఉప్మా దోశ..ఇలా ఎన్నో రకాలున్నాయి. కానీ.. మీరు ఐస్ క్రీం దోశను ఎప్పుడైనా చూశారా.. గతంలో దోసకాయను బంగాళాదుంప, పన్నీర్, చికెన్..ఉపయోగించిన చేసిన రెసిపీ గురించి చూశాము కదా.. ఇప్పుడు అలాగే.. విభిన్నరకమైన దోశను నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. అందులో ఓ వ్యక్తి ముందుగా వేడి పెనంపై దోశ వేశాడు.. ఆతర్వాత.. ఆ దోశపై ఐస్ క్రీమ్.. చాక్లెట్ క్రీమ్ సీరప్ వేసాడు.. ఆ తర్వాత.. డైరీ మిల్క్ చాక్లె్ట్ గ్రైండ్ చేసి దోశ మీద వేశాడు.. కాసేపటికి ఆ దోశ పూర్తిగా వేగిన తర్వాత.. తీసి అక్కడున్నవారికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను విజయ్ సేత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
@mayursejpal ? pic.twitter.com/FNFOL4Hyen
— vijay sheth (@vijaysheth) October 12, 2021
Also Read: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ
RGV’s Konda: అలాంటి వ్యక్తి బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి.. అది ఆర్జీవికి ఉంది: కొండాసురేఖ