Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: 982 అడుగుల లోయలో పడిన బస్సు.. 32 మంది దుర్మరణం.. 15 మందికి గాయాలు..

Bus Accident: దుర్గాష్టమి రోజున నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 982 అడుగుల ఎత్తైన లోయ నుంచి బస్సు పడటంతో 32 మంది దుర్మరణం చెందారు.

Bus Accident: 982 అడుగుల లోయలో పడిన బస్సు.. 32 మంది దుర్మరణం.. 15 మందికి గాయాలు..
Nepal Bus Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 13, 2021 | 12:45 PM

Bus Accident: దుర్గాష్టమి రోజున నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 982 అడుగుల ఎత్తైన లోయ నుంచి బస్సు పడటంతో 32 మంది దుర్మరణం చెందారు. ఈ విషాధ ఘటన బుధవారం నాడు నేపాల్‌లోని ముగు జిల్లాలోని ఛయనాథ్ రారా మునిసిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 45 మంది ప్రయాణికులు బస్సులో గంజ్ నుంచి గాంగాధి వెళ్తున్నారు. అయితే, కొండ ప్రాంతాల గుండా వెళ్తున్న బస్సు.. ముగు జిల్లాలోని ఛయనాథ్ రారా పరిధిలోకి రాగా అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి.. పీనాజ్యారి నదిలో పడిపోయింది. సుమారు 982 అడుగుల లోతులో బస్సులో పడిపోవడంతో.. అందులో ప్రయాణిస్తున్న 32 మంది ప్రయాణకులు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. ఘటనా స్థలానికి చేరకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వీరిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా విజయ దశమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.

Also read:

విధ్వంసం.. 114 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు 8 సిక్స్‌లు.. బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Gati Shakti launch: దేశ అభివృద్ధికి పీఎం గతిశక్తి.. ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ..

Lahari Shari: బిగ్ బాస్ తరువాత అమ్మడి రేంజే మారిపోయిందిగా.. ఇలా ‘లహరి శేరి’ ని ఎప్పుడైనాచూసారా..(ఫొటోస్)