LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్‌ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!

LPG Gas Cylinder: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతంగా పెరిగిపోతోంది. ప్రతి నెల ధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది..

LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్‌ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!
LPG cylinders
Follow us
Subhash Goud

|

Updated on: Oct 13, 2021 | 11:54 AM

LPG Gas Cylinder: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతంగా పెరిగిపోతోంది. ప్రతి నెల ధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. ధరల పెరుగుదల కారణంగా ప్రతి కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం సిలిండర్ ధర మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ధరలు కూడా పెరిగిపోతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. కానీ రూ.634కే సిలిండర్ పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. ఇది 14.2 కిలోల సిలిండర్ మాత్రం కాదు. సాధారణంగా 14.2 కేజీల సిలిండర్ ధర మార్కెట్‌లో రూ.950 వరకు ఉంది. ఈ సిలిండర్ కాకుండా కంపొసైజ్ ఎల్‌పీజీ సిలిండర్ అయితే తక్కువ ధరకే లభిస్తుంది. దీనిని రూ.634కే పొందవచ్చు. ఇది 10 కిలోల సిలిండర్. అంటే సాధారణ సిలిండర్‌తో పోలిస్తే ఇందులో 4 కిలోల గ్యాస్ తక్కువగా ఉంటుంది. కంపొసైట్ ఎల్‌పీజీ సిలిండర్ తీసుకోవడం వల్ల సిలిండర్ లోపల ఎంత గ్యాస్ ఉందో చూడవచ్చు. మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది సాధారణ సిలిండర్ కన్నా 7 కేజీల బరువు తక్కువగా ఉంటుంది. సులభంగా తీసుకెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్ సిలిండర్లు తుప్పు పట్టవు.

ఈ సిలిండర్‌లో రెండు రకాలు..

ఈ కంపొసైజ్ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఇందులో 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌, 10 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ 10 కిలోల సిలిండర్‌ రూ.634 ఉండగా, ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.502 ఉంది. ఇప్పుడు ఈ సిలిండర్లు దేశ వ్యాప్తంగా ఢిల్లీ, బనారస్‌, ప్రయాగ్‌రాజ్‌, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, జైపూర్‌, హైదరాబాద్‌, జలంధర్‌, పాట్నా, మైసూర్‌, లుధియానా, రాయపూర్‌, రాంచీ, అహ్మదాబాద్‌ సహా 28 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?

Wi-Fi Calling: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి..? స్మార్ట్‌ఫోన్‌లలో దీనిని ఎలా ఉపయోగించాలి..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?