Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. బుధవారం ప్రారంభ సెషన్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. 

Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సెన్సెక్స్
Stock Markets
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 13, 2021 | 10:28 AM

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. బుధవారం ప్రారంభ సెషన్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది.  337 పాయింట్ల లాభంతో 60,621.72 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠ స్థాయిని నమోదుచేసుకుంది. అటు నిఫ్టీ కూడా 74 పాయింట్ల లాభంతో 18,066 పాయింట్లకు చేరింది. కొద్దిసేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 60,576 పాయింట్ల దగ్గర ట్రేడ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 18,106 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా 2022లో భారత్ నిలుస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) అంచనాలు సూచీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఐఎంఎఫ్ తాజా నివేదిక దేశీయ పారిశ్రామిక వర్గాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

టాటా మోటార్స్, టాటా స్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్ప్ షేర్లు భారీ లాభాలను నమోదుచేసుకోగా..ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎయిచర్ మోటార్స్, హెచ్‌యూఎల్, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్ షేర్ విలువ 52 వారాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

Also Read..

National Corona: దేశంలో పూర్తిగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. మరణాలు కూడా.. తాజాగా ఎన్ని కేసులంటే..

అలర్ట్.. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులలో మరో కొత్త ఫంగస్‌.. మూడు నెలల్లో 4 కేసులు