Pulagam: నేడు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు.. దేవి నైవేద్యం పులగం ఎలా రెడీ చేయాలంటే..
శరన్నవరాత్రులు.. నేటికి ఎనిమిది రోజులు.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తుంటారు. మొదటి రోజు శైలపుత్రి నుంచి
శరన్నవరాత్రులు.. నేటికి ఎనిమిది రోజులు.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తుంటారు. మొదటి రోజు శైలపుత్రి నుంచి పదవరోజు రాజేశ్వరి అమ్మవారిగా ఆరాధిస్తుంటారు. ప్రతి రోజు… ఆయా అమ్మవార్లకు ఇష్టమైన పువ్వులతో అర్చిస్తూ.. వారికి ఇష్టమైన నైవిధ్యాన్ని నివేధిస్తారు.. ఈరోజు ఎనిమిదవ రోజు.. అంటే నేడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. అలాగే.. ఈరోజు అమ్మవారిని చామంతి, పొగడ, సంపెంగ… మల్లెపూలతో అర్చించాలి.. అలాగే.. అమ్మవారికి దానిమ్మ పండు సమర్పించాలి.. పొంగలి.. పులిహోర, పులగం దేవికి నివేదించాలి.
అయితే చాలా మందికి పులగం తయారీ తెలియదు.. దుర్గాదేవికి నివేధించే పులగంను ప్రత్యేకంగా తయారు చేయాలి. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు.. బియ్యం.. మూడు కప్పులు పెసరపప్పు.. ఒక కప్పు నెయ్యి.. రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి.. నాలుగు జీలకర్ర, ఆవాలు.. ఒక టీ స్పూన్ మిరియాలు.. పది జీడిపప్పు.. పది కరివేపాకు.. ఒక రెబ్బ పసుపు చిటికెడు ఉప్పు.. తగినంత
తయారీ విధానం.. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.. కుక్కర్లో నానిన బియ్యాన్ని కడిగిన పెసరపప్పు.. తగినంత ఉప్పు, ఎనిమిది కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి.. మరోక పాన్ లో నెయ్యి వేసి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.. మిరియాలు.. జీడిపప్పు.. పచ్చిమిర్చి వేసి వేయించాలి. చివరగా.. పసుపు జోడించి ఆ పోపును పప్పు అన్నంలో కలుపుకోవాలి.. అంతే దుర్గాదేవికి ఇష్టమైన పులగం సిద్ధమవుతుంది.
Also Read: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ