Barleria Prionitis: పల్లెటూర్లలో కనిపించే ఈ ముళ్ల మొక్కకు వజ్రదంతిగా పేరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు ఈ కామర్స్‌లో కూడా అమ్మకం

Barleria Prionitis Benefits:  ప్రకృతిలో ఉన్న మొక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాల గనులు. ఆయువేర్వేద వైద్యంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్ల ఆకులు, వేర్లు, కాండం, పువ్వులు,..

Barleria Prionitis: పల్లెటూర్లలో కనిపించే ఈ ముళ్ల మొక్కకు వజ్రదంతిగా పేరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు ఈ కామర్స్‌లో కూడా అమ్మకం
Barleria Prionitis
Follow us
Surya Kala

|

Updated on: Oct 12, 2021 | 10:06 PM

Barleria Prionitis Benefits:  ప్రకృతిలో ఉన్న మొక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాల గనులు. ఆయువేర్వేద వైద్యంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్ల ఆకులు, వేర్లు, కాండం, పువ్వులు, పండ్ల వంటి వాటినే మెడిసిన్స్ గా ఉపయోగిస్తారు. ఈరోజు గ్లోబలైజేషన్ కు ముందు పల్లెటూరిలో ఎక్కువగా కనిపించిన ముళ్ళపూల మొక్క గొబ్బి పూల గురించి తెలుసుకుందాం.. ఈ మొక్కలను ముళ్ల కనకాంబరం, అడవి కనకాంబరం , చవితి పూలు అని కూడా అంటారు.  శీతాకాలంలో ఎక్కువగా కనిపించే ఈ పువ్వులను నాగుల చవితి పూజకు ఉపయోగిస్తారు. ఈ పువ్వులను ఆడపిల్లలు తలలో కూడా పెట్టుకునేవారు. ఈ ముళ్ల పువ్వుల మొక్కలు పసుపు, నీలం రంగు వంటి రంగుల్లో కనువిందు చేస్తాయి. ఈ మొక్కలు అందానికే కాదు.. ఔషధ గుణాలు కూడా మెండు.. ఈ గొబ్బి పువ్వుల మొక్కలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

పళ్ళు తెల్లగా మెరవాలంటే ఈ మొక్క వేర్లతో పళ్ళు తోముకుంటే మంచి ఫలితం ఉంటుంది. అందుకనే ఈ మొక్క వేర్లను సంస్కృతంలో వజ్రదంతి అంటారు.

దంతాలకు పట్టిన గారను శుభ్రం చేసుకోవాలంటే.. గొబ్బి మొక్కల ఆకులను పేస్ట్ లో కొంచెం ఉప్పు వేసుకుని పళ్ళు తోముకుంటే గార, పసుపుదనం, పాచి తగ్గి.. శుభ్రంగా ఆరోగ్యంగా తయారవుతాయి.

నోటి దుర్వాసన, నోటిపూత వంటివి తగ్గడానికి ఆకుల డికాషన్ మంచి సహాయకారి. ఈ ఆకుల కాషాయం పుక్కిలి పడితే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకుల రసాన్ని,  తేనె కలుపుకొని తాగినా అద్భుత ఫలితం ఉంటుంది.

గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు గొబ్బి మొక్కల ఆకులను పేస్ట్ గా చేసుకుని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల నుండి రక్తం కారుతుంటే ఆకుల పేస్ట్ తో పళ్ళను తోముకుంటే నివారింపబడుతుంది.

కీళ్ళ వాపులు, అధిక బరువుతో ఇబ్బందిపడేవారు ఈ మొక్కలు బెరడును తీసుకొని బాగా కడిగి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఒళ్ళు నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చెంచా తీసుకోవడం వల్ల ఒళ్ళు నొప్పులు, శరీరంలో అధిక కొవ్వు తగ్గుతాయి.

మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల పేస్టు నొప్పి ఉన్న భాగంలో అప్లై చేస్తే నొప్పి, వాపు వంటివి తగ్గుతాయి.

ఎన్ని ఔషధ ప్రయోజనాలున్న తగిన మోతాదులో వాడాల్సి ఉంటుంది. లేదంటే ఆయుర్వేద డాక్టార్ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. పల్లెలో ఎక్కువగా కనిపించే ఈ మొక్కలు ఇప్పుడు అమెజాన్ వంటి ఈ కామర్స్ లో కూడా లభ్యమవుతున్నాయి.

Also Read:  మగవారిలో లైంగిక సామర్ధ్యం, స్త్రీలలో సంతాన వృద్ధికి దివ్యౌషధం.. వెల్లుల్లిపాలతో ఎన్నో ప్రయోజనాలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!