Minister Gangula: తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కి కరోనా పాజిటివ్

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Oct 12, 2021 | 9:53 PM

తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరము, జలుబు

Minister Gangula: తెలంగాణ  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్‌కి  కరోనా పాజిటివ్
Gangula

Follow us on

Gangula Kamalakar: తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరము, జలుబు ఉన్న కారణంగా ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి గంగుల పరీక్ష చేయించుకున్నారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా పాజిటివ్ అయిన కారణంగా తనను ఈ మధ్య కలిసిన ప్రతి ఒక్కరు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.

ఇక, దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. అయితే, రెండు రోజుల నుంచి 20వేల దిగువన కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,313 కేసులు నమోదయ్యాయి.

దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత రోజువారిగా నమోదయ్యే కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కాగా.. కేరళలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న నిమోదైన కరోనా కేసులు, మరణాల్లో కేరళలో 6,996 కేసులు నమోదు కాగా.. 84 మంది మరణించారు.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,85,920 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,50,963 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 26,579 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,20,057 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడు నెలల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గాయి.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95,89,78,049 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 65,86,092 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,81,766 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,50,38,043 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Read also: మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన: మంత్రి అనిల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu