సుగంధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్.. రైతాంగానికి మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన
ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరం జన్‌రెడ్డి అన్నారు. కావున తెలంగాణ రైతులు
Singireddy Niranjan Reddy: ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరం జన్‌రెడ్డి అన్నారు. కావున తెలంగాణ రైతులు సుగంధ ద్రవ్యాలపై దృష్టి సారించి నిమ్మగడ్డిని సాగు చేయాలని కోరారు. నిమ్మగడ్డిని ఒక్కసారి సాగు చేస్తే 5 సంవత్సరాల వరకు పంట వస్తూనే ఉంటుందన్నారు. అమ్మపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి ఇవాళ శంకు స్థాపన చేశారు. అదేవిధoగా వెల్టుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
నిమ్మగడ్డి పంటకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుందని మంత్రి తెలిపారు. కావున రైతులు నిమ్మగడ్డి సాగుపై దృష్టి సారించా లన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 770 కోట్ల మంది జనాభా ఉందని రానున్న రోజుల్లో సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. పంటలను సాగుచేసే రైతులకు డ్రిప్ ఇస్తామన్నారు. ప్రతి రైతు తమకున్న పొలంలో కొంతమేర కూరగాయాల పంటలపై దృష్టి సారించాలన్నారు.
యువ రైతులు ముఖ్యంగా ఇలాంటి వాణిజ్య పంటలపై దృష్టి సారించి మంచి దిగుబడులను పొందాలన్నారు. దేశానికి, రాష్ర్టానికి ఉపయోగపడే వాటిని చేయ్యడం గొప్ప పని అన్నారు. నిమ్మగడ్డి సాగుకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. జాతీయ రహాదారిపై ఉన్న వెల్టుర్ గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజురు చేసుకొని నిర్మించుకోవడం జరిగిందని, ఇక్కడి ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు చేస్తారని అన్నారు.
Read also: మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన: మంత్రి అనిల్