PM Modi Autograph: నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి.. మోదీ కోసం ఎదురు చూసిన యువతి.. చివరికి..!

మూడోవసారి అధికారమే లక్ష్యంగా ప్రధాన మంత్రి మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో అన్ని వర్గాలను ఇట్టే ఆకర్షిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మోదీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్బీ స్టేడియంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది.

PM Modi Autograph: నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి.. మోదీ కోసం ఎదురు చూసిన యువతి.. చివరికి..!
Modi Autograph
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2024 | 9:08 PM

మూడోవసారి అధికారమే లక్ష్యంగా ప్రధాన మంత్రి మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో అన్ని వర్గాలను ఇట్టే ఆకర్షిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మోదీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్బీ స్టేడియంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. మోదీ గురించి ప్రత్యేక పాట పాడిన విజయలక్ష్మీఅనే మహిళ ఆయన కంట పడింది. ఆయనను చూడగానే దగ్గరుకు వెళ్ళిన ఆమె తన కూతురు కోసం ఒక ఆటోగ్రాఫ్ కావాలంటూ కోరింది. దీంతో ఆమె విన్నపాన్ని మన్నించిన మోదీ సంతకం చేసి ఇచ్చారు. దీంతో విజయలక్ష్మీ ఎంతో మురిసిపోయింది. తనకు మోదీ సంతకం దొరకడం ఎంతో ఆనందంగా ఉందంటూ సంబరపడిపోయింది.

ఆమె ఎవరో కాదు స్వయాన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మీ. మూడు నెలల క్రితం మోదీపై పాట పాడింది దత్తాత్రేయ మనవరాలు. సోషల్ మీడియాలో ఆ పాట విన్న మోదీ.. సూపర్‌ అంటూ సోషల్ మీడియా వేదికగా రీట్వీట్‌ కూడా చేశారు. ఇక ఆ పాట పాడింది తన కూతరేనంటూ మోదీకి వివరించారు విజయలక్ష్మీ. మీరంటే తన కూతురుకి ఎంతో ఇష్టమని ఆటో గ్రాఫ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరారు. దీంతో సంతోషంగా ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు మోదీ. ఇలా మరోసారి మోదీ ఆటోగ్రాఫ్ సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వీడియో చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…