AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddapalli పెండింగ్‌లో గోమాస శ్రీనివాస్ బీఫాం.. అభ్యర్థి అన్వేషణలో కాషాయ దళం..!

పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి ముందుగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గోమాస శ్రీనివాస్‌ను రెండవ జాబితాలోనే పేరు ప్రకటించింది కషాయ దళం. అయితే అధిష్టానానికి తగ్గట్లుగా ప్రచార స్పీడ్‌ను పెంచలేకపోయారట.

Peddapalli పెండింగ్‌లో గోమాస శ్రీనివాస్ బీఫాం.. అభ్యర్థి అన్వేషణలో కాషాయ దళం..!
Gomasa Srinivas
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 21, 2024 | 5:50 PM

Share

పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి ముందుగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గోమాస శ్రీనివాస్‌ను రెండవ జాబితాలోనే పేరు ప్రకటించింది కషాయ దళం. అయితే అధిష్టానానికి తగ్గట్లుగా ప్రచార స్పీడ్‌ను పెంచలేకపోయారట. ఈ క్రమంలో బీజేపీలో వ్యతిరేకవర్గం అతనిని తప్పించాలని పట్టుబడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ‌నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో గోమాస శ్రీనివాస్‌ కంగుతిన్నారు. బీఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. దీంతో టికెట్ మార్చే యోచనలో అధిష్టానం ఉందన్న ప్రచారం జోరందుకుంది.

పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకే బలమైనా నేతల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ముందుగా బీఅర్ఎస్, తరువాత కాంగ్రెస్ నేతలపై‌ దృష్టి పెట్టింది.ఈ నేఫద్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గోమాస‌ శ్రీనివాస్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంది. పార్టీలో చేరన వెంటనే గోమాస శ్రీనివాస్ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి వరకు కాంగ్రెస్, బీఅర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. గోమాస శ్రీనివాస్ కి ప్రచారం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ అధిష్టానం అంచనాలకి అనుగుణంగా ప్రచారం చేయలేకపోయారట. అంతే కాకుండా బీజేపీ క్యాడర్‌ను కలుపుకోలేకపోయారన్న టాక్ వినిపించింది.

దీంతో ఓ వర్గం గోమాస శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అధిష్టానం సర్వేలో కూడా ప్రచారంలో వెనకంజలో ఉన్నారని అంచనా వేసింది. దీంతో అందరికి బీఫాంలు అందించిన హైకమాండ్, గోమాస శ్రీనివాస్‌కు మాత్రం బీఫాం ఇవ్వలేదు. ఇదిలావుంటే, సిట్టింగ్ ఎంపీ ఇటివల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత కూడా టికెట్ ఇస్తే కాషాయ కండువా కప్పుకోవడానికి రెఢిగా ఉన్నారట. ఇప్పటికే మరి కొంతమంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గోమాస శ్రీనివాస్, వెంకటేష్ నేత ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఒకవేళ గోమాస శ్రీనివాస్ ను మార్చితే జరిగే పరిణామలపై దృష్టి పెట్టింది కషాయ దళం.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సాల్ ఈ టికెట్‌పై సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక్కడ రెండు ప్రత్యర్థి ‌పార్టీలు మాల సామాజిక సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిన నేపధ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా నడుస్తోందట. గోమాస శ్రీనివాస్‌కు బీపాం ఇవ్వాలా, లేదా అనే అంశంపై ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…