అచ్చమైన సొంతూరి ఆవకాయ తినాలని ఉందా..? గుడ్‌న్యూస్ చెప్పిన TSRTC
ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త. టీఆఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయను డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా పంపించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఎండాకాలం వచ్చిందంటే.. వెంటనే గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. కొత్త మామిడి కాయ పచ్చడి ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు. అందులో కాస్త నెయ్యి వేసి తింటే.. ఆహా అద్భుతం అంతే. పిల్లలు అందరూ అమ్మమ్మ గారి ఇళ్లకు వెళ్లి.. కొత్త ఆవకాయను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ పాత రోజులు లేవు. ఎండాకాలంలో సొంతూర్లకు వెళ్లేవారు తక్కువైపోయారు. చాలామంది పట్టణాలు, నగరాల్లోనే ఉంటున్నారు. ఇక అమ్మలు, నానమ్మలు పెట్టే ఆవకాయను సీటీలకు తీసుకువచ్చేందుకు కూడా చాలామంది కష్టాలు పడుతుంటారు. ఆ సమస్యకు TSRTC చెక్ పెట్టింది. ఆవకాయ ప్రియులకు శుభవార్త చెప్పింది.
TSRTC లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయను డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా పంపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చని తెలిపారు. ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోందన్నారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోందని తెలిపారు. సమాచారం కోసం… TSRTC కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 కాల్ చేయాలన్నారు.
ఈ అవకాశం కల్పించినందుకు TSRTC కి పలువురు థ్యాంక్స్ తెలుపుతున్నారు. ఈసారి తప్పకుండా అమ్మమ్మ చేతి అవకాయ మిస్ అవ్వమని కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..