Telangana: ఎంత పనిచేశావ్‌ రా.. చోరీ విషయం చెప్పాడని బాలుడిని చంపాడు.. ఆ తర్వాత సెల్ టవర్‌ ఎక్కి..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్.. బాలుడిని చంపి సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు అనే రౌడీషీటర్ కేబుల్‌ వైర్లు చోరీ చేశాడు.

Telangana: ఎంత పనిచేశావ్‌ రా.. చోరీ విషయం చెప్పాడని బాలుడిని చంపాడు.. ఆ తర్వాత సెల్ టవర్‌ ఎక్కి..
Crime News
Follow us

|

Updated on: Apr 21, 2024 | 5:22 PM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్.. బాలుడిని చంపి సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు అనే రౌడీషీటర్ కేబుల్‌ వైర్లు చోరీ చేశాడు. అయితే, ఈ దొంగతనం విషయాన్ని వేఖర్ (13) అనే బాలుడు చెప్పాడు.. ఈ విషయాన్ని బయటకు చెప్పాడని శేఖర్‌ పై కక్ష పెంచుకున్నాడు నాగరాజు.. ఈ క్రమంలో.. శనివారం రాత్రి మాట్లాడాలని చెప్పి శేఖర్ ను పిలిచిన నాగరాజు.. గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు. అనంతరం బాలుడి మృతదేహం కనిపించకుండా బావిలో పడేశారు.

ఈ క్రమంలోనే.. ఓ వ్యాపారిని డబ్బులు కావాలంటూ అడగ్గా.. అతను ఇచ్చేందుకు నిరాకరించాడు.. దీంతో డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో రౌడీషీటర్‌ నాగరాజును అరెస్టు చేసేందుకు ఆదివారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లారు.

పోలీసులను చూసిన నాగరాజు భయపడి గ్రామంలోని సెల్‌టవర్‌ ఎక్కాడు. చోరీ విషయంలో తన పేరు చెప్పినందుకు బాలుడిని చంపి బావిలో పడేశానని.. పైనుంచి చెప్పాడు. దీంతో పోలీసులు బావిలోని బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు.

అయితే, ఈ సమాచారం అందుకున్న బాలుడి బంధువులు పెద్ద ఎత్తున సెల్‌టవర్‌ వద్దకు చేరుకోవడంతో.. వారు దాడి చేస్తారని భయపడిన నాగరాజు.. సెల్‌ టవర్‌ పైనే.. అక్కడ ఉన్న వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయని.. వ్యాపారులు, దుకాణదారులపై తరచూ దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..