Watch Video: గోవాను ఊపిన తెలంగాణ పొలిటికల్ సాంగ్స్.. చిందేసిన లోకల్ లీడర్లు

తెలంగాణ రాజకీయ పాటలతో గోవా ఊగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాటలు గోవా రిసార్ట్స్, క్రూజ్ షిప్స్‎లో రచ్చ రంబోలా చేస్తున్నాయి.

Watch Video: గోవాను ఊపిన తెలంగాణ పొలిటికల్ సాంగ్స్.. చిందేసిన లోకల్ లీడర్లు
Telangana Political Parties In Goa
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 26, 2024 | 9:55 PM

తెలంగాణ రాజకీయ పాటలతో గోవా ఊగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాటలు గోవా రిసార్ట్స్, క్రూజ్ షిప్స్‎లో రచ్చ రంబోలా చేస్తున్నాయి. ఈ పొలిటికల్ డీజే పాటలకు స్టేప్పులు వేసింది టూరిస్టులో, ఇంకెవరో కాదు మన పొలిటీషయన్సే. పాలమూరు పాలిటిక్స్ బీచ్ డెస్టినెషన్ గోవాలో హాట్ హాట్‎గా సాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గోవాలో క్యాంప్‎లు ఏర్పాటు చేశాయి. అయితే హోలీ సందర్భంగా రెండు పార్టీల శిబిరాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆడి పాడారు. క్రూజ్ షిప్స్, రిసార్ట్స్‎లో ఏ పార్టీకి చెందిన పాటలకు ఆ పార్టీ నేతల స్టెప్పులేసి రచ్చ రంబోలా చేశారు. దాదాపుగా ఐదు రోజులుగా గోవాలోనే కాలం వెళ్లదీస్తున్న నేతలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీ సమ్మర్ వెకెషన్ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులకు చెబుతున్నారట.

మూడు రంగుల జెండా పాటకు హస్తం నేతలు:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్‎ను ఊపు ఊపిన మూడు రంగుల జెండా పట్టి పాట హస్తం శిబిరంలో జోష్ నింపింది. కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓ రిసార్ట్‎లో డిజే పెట్టి పాటను ప్లే చేయించి డ్యాన్స్‎లో మునిగిపోయారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కలిసి చిందేశారు.

గులాబీల జెండలే రామక్క సాంగ్‎కు కాలు కదిపిన బీఆర్ఎస్ లీడర్లు:

కాంగ్రెస్ పార్టీ కంటే ముందే గోవాలో శిబిరం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ లీడర్లు ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఓటర్లను తరలించారు. దాదాపుగా 600పైగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు నియోజకవర్గాల వారీగా క్యాంపులు ఏర్పాటు చేశారు. గత ఐదురోజలుగా గోవాలో ఎంజాయ్ చేస్తున్న బీఆర్ఎస్ బ్యాచ్ హోలీ సందర్భంగా ప్రత్యేక సెలబ్రేషన్స్ చేసుకున్నారు. క్రూజ్ షిప్ పై, రిసార్ట్స్‎లో బీఆర్ఎస్ పార్టీ సాంగ్ గులాబీల జెండలే రామక్క సాంగ్‎కు స్త్రీ, పురుష సంబంధం లేకుండా కాలు కదిపారు. అభ్యర్థులు గెలుపోటముల లెక్కల్లో తెగ టెన్షన్ పడుతుంటే ఓటర్లు మాత్రం గోవా అందాలను ఎంజాయ్ చేయడంతో పాటు డీజే పాటలు, డ్యాన్స్‎లు, వేడుకల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…